Rashmika Mandanna: విజయ్ పోస్ట్‌కు.. ఎంత క్యూట్‌గా బదులిచ్చిందో..
ABN, Publish Date - Jun 28 , 2025 | 01:37 PM
విజయ్ దేవరకొండ రశ్మికకు ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనలు చెప్పారు. విజయ్ పోస్ట్‌కు రష్మిక ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా ‘మైసా’ (Mysaa) అనే చిత్రం చేస్తోంది. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. రవీంద్ర పుల్లె (Ravindra pulle) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పోస్టర్‌లో లుక్ డిఫరెంట్‌గా ఉండటంతో రష్మిక కొత్త ప్రయత్నం చేసిందంటూ విషెశ్ చెబుతున్నారు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనలు చెప్పారు. విజయ్ పోస్ట్‌కు రష్మిక ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటుంది.
‘ఈ పోస్టర్, నీ లుక్ టెర్రిఫిక్‌గా ఉంది’ అంటూ విజయ్ దేవరకొండ ‘మైసా’ పోస్టర్‌ను షేర్ చేశారు. దీనిని రష్మిక షేర్ చేసి 'విజ్జూ.. ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా' అని క్యాప్షన్ పెడుతూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. విజయ్‌ను ఆమె 'విజ్జూ' అని పిలవడంతో మరోసారి ఈ పెయిర్ హాట్ టాపిక్‌గా మారింది.
'గీత గోవిందం’ సినిమా నుంచి వీరిద్దరిపై రూమర్స్ ఉన్న సంగతి తెలిసిందే! ఈ జంట రిలేషన్‌లో ఉన్నారంటూ అప్పటి నుంచీ వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ టూర్స్‌కి వెళ్లడం, పండుగలకు పబ్బాలకు, విజయ్ ఇంట్లో రష్మిక కనిపించడం వంటి ఫొటోలు బయటకు రావడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఇటీవల ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించడం కూడా ఓ కారణం. ప్రస్తుతం రష్మిక వరుస చిత్రాలతో బిజీగా ఉంది.