సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: ఆ హీరోల నుంచి అవి.. విజయ్ నుంచి అన్నీ కావాలి 

ABN, Publish Date - Jun 16 , 2025 | 04:46 PM

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న పేర్లు చెప్పగానే.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే మాటలు వినిపిస్తుంటాయి. దీనిపై ఇద్దరూ ఎన్నిసార్లు స్పందించారు.

విజయ్‌ దేవరకొండ(vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) పేర్లు చెప్పగానే.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే మాటలు వినిపిస్తుంటాయి. దీనిపై ఇద్దరూ ఎన్నిసార్లు స్పందించారు. అలాంటిదేమీ లేదని చెప్పారు. అయితే వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడిన ప్రతిసారీ ఈ టాపిక్‌ హాట్‌ టాపిక్‌గా అవుతుంటుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘కుబేర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ గురించి మాట్లాడింది. యాంకర్‌ సుమ.. ఈ సినిమాలో నటించిన ధనుష్‌, నాగార్జునలను పలు ప్రశ్నలు అడిగింది.

రష్మికని మాత్రం ఫలానా హీరోల నుంచి ఏం కాపీ కొడతారు అని అడగ్గా.. నాగార్జున దగ్గర నుంచి ఛార్మ్‌, ధనుష్‌ దగ్గర సూర్యుడి కింద అయిన పనిచేేసలా బలం, అల్లు అర్జున్‌ నుంచి స్వాగ్‌, విజయ్‌ దేవరకొండ దగ్గర నుంచి మాత్రం అన్నీ కావాలి అని బదులిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కుబేర. జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ధనుష్‌, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ధనిక-పేద, డబ్బు నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.  

ALSO READ: Manchu Vishnu: కన్నప్పను వీక్షించిన  రజినీకాంత్.. విష్ణు ఎమోషనల్ 

The Rajasaab: రాజా సాబ్.. మారుతి మొత్తం చెప్పేశాడు..


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



Updated Date - Jun 16 , 2025 | 05:09 PM