సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: ఒకరితో జర్నీ చేస్తే.. కచ్చితంగా మార్పు వస్తుంది

ABN, Publish Date - Jul 12 , 2025 | 02:39 PM

తాజాగా  ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక  మందన్న డేటింగ్ గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వ్యక్తి  తో డేటింగ్ చేయాలనుందో  చెప్పారు.  ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

పుష్ప, యానిమల్‌(Animal) , ఛావా చిత్రాల తర్వాత మరింత జోరు పెంచింది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. అయితే యానిమల్‌ చిత్రం ఎంతగా విజయం సాధించిందో అంతే విమర్శలు తీసుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక (rashmika Mandanna) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'యానిమల్‌' సినిమాలో హీరో పాత్ర లాంటి వ్యక్తితో డేటింగ్‌ చేయడానికి  ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఆ ఇంటర్వ్యూలో నిజ జీవితంలో ‘యానిమల్‌’లో హీరో పాత్ర స్వబావం ఉన్న వ్యక్తితో డేటింగ్‌ (Dating) చేస్తారా? అతనిలో మార్పు తీసుకురాగలరా? అని అడిగిన ప్రశ్నకు రష్మిక ఆసక్తికర సమాధానమిచ్చారు. 'మనం ఒకరిని ప్రేమించినా, మనల్ని ఒకరు ప్రేమించినా మార్పు కచ్చితంగా వస్తుందని బలంగా నమ్ముతాను. ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుంది. ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకుంటారు. ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుంటారు. సో దాని వల్ల ఒకరి కోసం ఒకరు మారతారు. మీ ప్రాణ  స్నేహితుడితో కానీ, మీ భాగస్వామితో కాని కొంతకాలం కలిసి ప్రయాణించాక.. అకస్మాత్తుగా పాత రోజులు గుర్తు చేసుకుంటే వారి కోసం మీరు ఎంతలా మారారో అర్థమవుతుంది' అని అన్నారు.  

ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా చేస్తున్నారు. తాజాగా  ‘మైసా’  అనే చిత్రాన్ని   ప్రకటించారు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి ‘థామా’ అనే హారర్‌ కామెడీలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అట్లీ- అల్లు అర్జున్‌ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో ఈమె కథానాయికగా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

Updated Date - Jul 12 , 2025 | 04:17 PM