Rashmika Mandanna: అతిరపల్లిలో.. రష్మిక యాక్షన్ షురూ
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:57 AM
నేషనల్ క్రస్ రష్మిక వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ నెల 7న తెలుగులో ఆమె నటించిన ‘ద గర్ల్ ఫ్రెండ్’ చిత్రం విడుదల కానుంది. అలాగే రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ చిత్రం చేస్తోంది,
నేషనల్ క్రస్ రష్మిక (Rashmika Mandanna) వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ నెల 7న తెలుగులో ఆమె నటించిన ‘ద గర్ల్ ఫ్రెండ్’ (The Girl friend) చిత్రం విడుదల కానుంది. అలాగే రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ (Mysaa) చిత్రం చేస్తోంది. రష్మిక నటిస్తున తొలి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. గోండు తెగల నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగభరిత యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. అన్ ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కేరళలోని అతిరపల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ ప్రారంభించారు. 
ఈ విషయాన్ని దర్శకుడు రవీంద్ర ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. అక్కడ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ వీడియోను దర్శకుడు షేర్ చేసి ‘మైసా యుద్ధానికి సిద్ధమవుతోంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రచార కార్యక్రమాతో బిజీగా ఉన్న రష్మిక.. త్వరలోనే సెట్స్‌లోకి అడుగు పెట్టనుంది. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకు? ముందుకు వచ్చే అవకాశముంది.