Rasha Thadani: జయకృష్ణ కోసం బాలీవుడ్ బ్యూటీ..
ABN, Publish Date - Nov 17 , 2025 | 01:59 PM
సూపర్‌స్టార్ కృష్ణ (superstar Krishna) ఇంటి నుంచి మరో యువహీరో రాబోతున్న సంగతి తెలిసిందే! దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ (Jaya Krishna) ఘట్టమనేని హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. అయన సరసన బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికైంది
సూపర్‌స్టార్ కృష్ణ (superstar Krishna) ఇంటి నుంచి మరో యువహీరో రాబోతున్న సంగతి తెలిసిందే! దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ (Jaya Krishna) ఘట్టమనేని హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి (Ajay Bhupati 4)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జయకృష్ణ సరసన రవీనా టాండన్, అనిల్ థడానీ దంపతుల కూతురు రషా థడానీ (Rasha Thadani) కథానాయికగా ఎంపికైంది. టాలీవుడ్‌కు స్వాగతం పలుకుతూ మేకర్స్ ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే రషా ‘ఆజాద్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ‘ఉయ్ అమ్మా’ పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రషా ఒక బైక్‌పై చాలా స్టైలిష్‌గా, రగ్డ్ లుక్‌లో కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరి, కొండల నడుమ చాలా సహజంగా సాగుతుందని చిత్ర బృందం ఓ పోస్టర్‌తో తెలిపింది. అజయ్ భూపతి తన చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు బలంగా, గ్లామర్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఈ సినిమాలో కూడా రషా థడానీ కోసం ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ రోల్‌ను సిద్థం చేసే ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సినిమాకు ఇద్దరు భారీ నిర్మాతలు దొరికారు. సి. అశ్విని దత్ (వైజయంతీ మూవీస్) సమర్పణలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై పి. కిరణ్ ఆ సినిమాను నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుందని ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.