Kothapallilo Okappudu: రానా సినిమా నుంచి.. రంగనాయకి లిరికల్ వీడియో సాంగ్
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:28 PM
గతంలో కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిర్మాత ప్రవీణ పరుచూరిమరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిర్మాత, నటి ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri) తాజాగా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సారి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu) అనే సినిమాను రూపొందించింది.
మనోజ్ చంద్ర (Manoj Chandra), మౌనిక (Monika T), ఉషా బోనెల (Usha Bonela) హీరో హీరోయున్లుగా పరిచయం అవుతుండగా రవీంద్ర విజయ్ (Ravindra Vijay), బెనర్జీ, బొంగు సత్తి, ఫణి కీలక పాత్రల్లో నటించారు. రానా (Rana Daggubati) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ అద్భుత రెస్పాన్స్ దక్కించకుంది. అయితే.. తాజాగా ఈ మూవీ నుంచి రంగనాయకి (Ranga Nayaki Lyrical Video) అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad) సాహిత్యం అందించగా మణిశర్మ (Mani Sharma) సంగీతంలో ధనుంజయ (Dhanunjay Seepana) ఆలపించారు.