సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajasekhar: 27 ఏళ్ల తరువాత రాజశేఖర్ తో రొమాన్స్ కి సిద్దమైన శివగామి

ABN, Publish Date - Nov 18 , 2025 | 03:34 PM

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) ఈమధ్య జోరు పెంచిన విషయం తెల్సిందే. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా చేయడం మొదలుపెట్టారు.

Rajasekhar

Rajasekhar: యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) ఈమధ్య జోరు పెంచిన విషయం తెల్సిందే. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ కు అదేమీ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఇక ప్రస్తుతం బైకర్ సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాడు. ఒకపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూనే ఇంకోపక్క హీరోగా కూడా రాబోతున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ లో సూపర్ హిట్ అయిన లబ్బరు పందు సినిమాను రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ కళ్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్ లో కూడా రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమానే రాజశేఖర్ రీమేక్ చేస్తున్నాడు.

ఇందులో దినేష్ పాత్రలో రాజశేఖర్ నటిస్తుండగా.. హరీష్ కళ్యాణ్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా రాజశేఖర్ కుమార్తె శివాని నటిస్తుంది. సినిమా మొత్తానికి హైలైట్ అంటే.. శ్వాసిక పాత్రనే అని చెప్పాలి. క్రికెట్ అంటే పిచ్చి ఉన్న భర్తను.. ఆ పిచ్చి మాన్పించి, అందరి మూడ్ను గౌరవంగా నిలబడాలని, ప్రేమించి పెళ్లి చేసుకొని బయటకు వచ్చాకా.. తన కుటుంబానికి అల్లుడును గొప్పగా చూపించాలని ఆరాటపడే పాత్రలో ఆమె ఎంతో అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఎవరు చేస్తారు అనే డైలమా నేటితో తీరిపోయింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. రాజశేఖర్ భార్యగా శివగామి రమ్యకృష్ణను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా రాజశేఖర్- రమ్యకృష్ణ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అల్లరి ప్రియుడు లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబోలో దీర్ఘ సుమంగళీ భవ, బలరామ కృష్ణులు సినిమాలు వచ్చాయి. 1998 తరువాత ఈ జంట మళ్లీ కలిసి కనిపించలేదు. దాదాపు 27 ఏళ్ళ తరువాత మరోసారి ఈ జంట ఈ రీమేక్ తో కలవనున్నారు. అప్పటి కెమిస్ట్రీ ఇప్పుడు కూడా వర్క్ అవుతూ అవుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 18 , 2025 | 03:34 PM