సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణంలో  ఆంథాలజీ.. 

ABN, Publish Date - Aug 31 , 2025 | 05:36 PM

దర్శక, నిర్మాత రమేష్ వర్మ (Ramesh Varma) కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు గానూ ‘ఆర్‌వి ఫిల్మ్ హౌస్’ అనే బ్యానర్‌ను స్థాపించారు.

దర్శక, నిర్మాత రమేష్ వర్మ (Ramesh Varma) కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు గానూ ‘ఆర్‌వి ఫిల్మ్ హౌస్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ సంస్థలో తొలి సినిమా ‘కొక్కొరొకో’ (Kokkoroko) చిత్రాన్ని ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.  ముహూర్తపు షాట్‌కు నిర్మాత రేఖ వర్మ క్లాప్ కొట్టగా.. నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రమేష్ వర్మ స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీనివాస్ వసంతలకు అందజేశారు. ఈ సినిమాతో  శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

ప్రముఖ స్క్రీన్ రైటర్ జి. సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు  నేపథ్య గాయకుడు జివి సాగర్ ఈ మూవీకి మాటలు రాస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఆకాష్ ఆర్ జోషి, లండన్‌కు చెందిన ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సంకీర్తన్ పని చేయనున్నారు.  ఎడిటర్‌గా ప్రవీణ్ పూడి పని చేయనున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను రమేష్ వర్మ స్వయంగా రూపొందించారు. ఆర్‌వి ఫిల్మ్ హౌస్ బ్యానర్‌లో మొదటి చిత్రంగా తెలుగులో ఓ చక్కటి ఆంథాలజీ కానుందని, అద్భుతమైన విజువల్స్, మంచి ఎమోషన్స్‌తో ‘కొక్కొరొకో’ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Updated Date - Aug 31 , 2025 | 05:37 PM