Andhra King Taluka: మన సాగర్ మంచి డేట్‌నే పట్టినట్టు ఉన్నాడే

ABN , Publish Date - Aug 22 , 2025 | 10:13 PM

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) కి ప్రస్తుతం ఒక మంచి హిట్ చాలా అంటే చాలా ముఖ్యం.

Andhra King Taluka

Andhra King Taluka: ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) కి ప్రస్తుతం ఒక మంచి హిట్ చాలా అంటే చాలా ముఖ్యం. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్.. ఆ తరువాత అరడజను సినిమాల్లో నటించాడు. అయినా అంతటి హిట్ ను అందుకోలేకపోయాడు. ఈసారి మాత్రం ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రామ్ నుంచి వస్తున్న కొత్త చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka).


రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. మునుపెన్నడూ లేనివిధంగా రామ్.. ఈ సినిమా కోసం లిరిసిస్ట్ ‌ కూడా మారాడు. ప్రస్తుతం రామ్, భాగ్యశ్రీ ఆశలన్నీ ఈ‌ సినిమాపైనే పెట్టుకున్నారు.


ఇక ఈ సినిమాలో ఉపేంద్ర తన ఒరిజినల్ క్యారెక్టర్ అంటే స్టార్ హీరో గానే కనిపిస్తున్నాడు. ఆయనకు వీరాభిమాని సాగర్ గా రామ్ నటిస్తున్నాడు. తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. నవంబర్ 28 న ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ డేట్ గురించే ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. రామ్ మంచి డేట్ నే పట్టాడని మాట్లాడుకుంటున్నారు.


అదేంటి.. డిసెంబర్ 5 న రాజాసాబ్ ఉందిగా.. కేవలం వారం రోజుల గ్యాప్ లో రామ్ వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందిగా .. అది తెలిసి కూడా దింపుతున్నారా అంటే అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ డిసెంబర్ నుంచి సంక్రాంతికి వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అంత ధైర్యంగా రామ్ ఆ డేట్ ను ఎంచుకున్నాడని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఆంధ్రా కింగ్ తాలూకాకు రూట్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పొచ్చు. చూస్తుంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి.. కథ కూడా బావుంటే రామ్ హిట్ ట్రాక్ ఎక్కినట్టే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈసారి రామ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Vedhika: బికినీలో వేదిక.. కుర్రాళ్లకు నిద్ర పట్టేలా లేదికా

Sundarakanda: 'సుందరకాండ' నుంచి' డియర్ ఐరా రిలీజ్  

Updated Date - Aug 22 , 2025 | 10:13 PM