Ram Pothineni: అయ్యో.. రామయ్యా.. ఎంత కష్టం వచ్చింది
ABN, Publish Date - Dec 16 , 2025 | 09:42 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కి హిట్ అన్న మాటనే వినిపించలేదు.
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కి హిట్ అన్న మాటనే వినిపించలేదు. ఎంతో ఆశతో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ చేస్తే.. అది కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక గ్యాప్ తీసుకొని.. ఆచితూచి ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. ఈ సినిమా కోసం మునుపెన్నడూ చేయని పనులు కూడా చేశాడు. ఒక సాంగ్ కు లిరిక్స్ రాసి గేయ రచయితగా మారాడు.. ఇంకో సాంగ్ ను పాడి సింగర్ గా అవతారం ఎత్తాడు. అంతేనా అంతకుముందు ఏ సినిమాకు చేయనంత ప్రమోషన్స్ చేశాడు. కానీ, సినిమా మాత్రం అభిమానులకు అంతంత మాత్రంగానే నచ్చింది.
ఇక ఈ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అంటే.. కొన్ని పేర్లు వినిపించినా అందులో నిజమెంత అనేది ఎవరికి తెలియదు. హిట్ కోసం ఈ కుర్ర హీరో చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈసారి వారిని వీరిని నమ్ముకుంటే పని కాదని, తానే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కథ బావుంటేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ ఏ కథ చేసిన ప్లాప్ అవుతూనే ఉంది. దీంతో తనకు నచ్చే కథను తానే రాసుకోవడం మొదలుపెట్టాడట రామ్. అంటే స్టోరీ రైటర్ గా మారి ఒక కథను రెడీ చేస్తున్నాడని సమాచారం.
నువ్వుంటే చాలులే అని ఆంధ్ర కింగ్ తాలూకాలో సాంగ్ రాసాడు. అవేమి అంత గొప్ప లిరిక్స్ కాకపోయినా.. ఒక హీరో అయ్యి ఉండి.. సిచ్యువేషన్ కి తగ్గట్లు సాహిత్యం రాయడం అనేది గొప్ప విషయమే. ఇప్పుడు అలాగే తనకు నచ్చినట్లు.. తనకు సూట్ అయ్యేట్లు ఒక కథను తీర్చుదిద్దుతున్నాడట. ఆ కథ తన మనసుకు కనుక సంతృప్తి అనిపిస్తే అప్పుడు నిర్మాతను, డైరెక్టర్ ను ఎన్నుకొని సినిమా మొదలుపెట్టనున్నాడట రామ్. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. అయ్యో.. రామయ్య.. ఎంత కష్టం వచ్చింది. హిట్ కోసం ఇంతలా కష్టపడాలా.. ? అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కథ కోసం రామ్ గ్యాప్ తీసుకొని అదే సినిమా చేస్తాడా.. ? మధ్యలో వేరే డైరెక్టర్ తో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొడతాడా.. ? చూడాలి.