Ram Lakshman: గన్‌కి.. త్రిశూలం పవర్, శివుని శక్తి తోడైతే! అఖండలో.. బాలయ్య నట విశ్వరూపం చూస్తారు
ABN, Publish Date - Nov 25 , 2025 | 07:33 AM
సాధారణంగా గన్ కే ఒక పవర్ ఉంటుంది. ఆ గన్‌కి త్రిశూలం పవర్, శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందనే కోణంలో ఈ సినిమాలో పోరాటాలను చిత్రీకరించాం.
‘అఖండ’ (Akhanda) కి మించిన అంచనాలు ‘అఖండ 2’పై ఉన్నాయి. మొదటి భాగంలో బాలకృష్ణగారి పాత్రను పరిచయం చేశారు. ‘అఖండ 2’ తాండవం (Akhanda2 Thandavam) లో డైరెక్టర్ బోయపాటి (Boyapati Srinu) గారు బాలయ్య (Balakrishna) నట విశ్వరూపాన్ని చూపించనున్నారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో ప్రాతని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా అంతే ధృడంగా ఉండాలి. అలాంటి ప్రతి నాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి (Aadi Pinisetty)అద్భుతంగా నటించారు’ అని అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ (Ram Lakshman).
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ -లక్ష్మణ్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘గన్‌ని త్రిశూలంతో ఆపరేట్ చేసే సన్నివేశాన్ని ట్రైలర్‌లో చూసే ఉంటారు. సాధారణంగా గన్ కే ఒక పవర్ ఉంటుంది. ఆ గన్‌కి త్రిశూలం పవర్, శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందనే కోణంలో పోరాటాలను చిత్రీకరించాం.
ఓంకారం శక్తి, శివశక్తిని గుండెల్లో నింపుకుంటే జీవితం ఎంత ఆనందంగా, అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని డైరెక్టర్ బోయపాటి అద్భుతంగా తెరకెక్కించారు. బాలకృష్ణ గారికి అభిమానులకు రియల్‌గా కనిపించాలనే తపన ఉంటుంది. ప్రతీ షాట్‌ని డూప్ లేకుండా ఆయనే చేశారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అటువంటిది. ఈ సినిమాలో మూడు భిన్నమైన పాత్రలకు సంబంధించిన పోరాట సన్నివేశాలుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆ సన్నివేశాలు ఆద్యంతం అలరిస్తాయి’ అని చెప్పారు.