Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు

ABN, Publish Date - Sep 14 , 2025 | 02:11 PM

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 1/8

'మిరాయ్'లో  శ్రీరాముడిగా ఓ వ్యక్తి తెరపైన తళుక్కున మెరిశారు. అతను ఎవరు? భగవాన్ శ్రీరామ పాత్రను చేసే అవకాశం, అదృష్టం ఎవరికి లభించింది? అనే పలు ప్రశ్నలు ఎంతో మంది మదిలో మెదిలాయి.

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 2/8

రాముడి పాత్ర అంటే... మాటలు కాదు... తెలుగు సినిమా రంగంలో ఉద్దండులైన మహానటుడు పోషించిన పాత్ర ఇది. ఇక నందమూరి తారక రామారావు అంటే తెలుగువారికి వెండితెర వేలుపు... స్వయంగా శ్రీరాముడే అని భావించే పరిస్థితి. అలాంటి గొప్ప పాత్రను పోషించే అరుదైన అవకాశం ఉత్తరాఖండ్ కు చెందిన గౌరవ్ బోరాకు దక్కింది. 

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 3/8

ఖతీమా కు చెందిన గౌరవ్ బోరా డెహ్రాడూన్ లో మాస్ కమ్యూనికేషన్ చేశారు. ఆ తర్వాత నటన మీద మక్కువతో న్యూ ఢిల్లీ చేరి, అక్కడ ఐదేళ్ళ పాటు 'కింగ్ డమ్ ఆఫ్ డ్రీమ్స్, రాస్ థియేటర్ గ్రూప్'లో నటించారు.

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 4/8

పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ, హిందీ సీరియల్స్ లోనూ నటించిన అనుభవం గౌరవ్ బోరాకు ఉంది. అలానే ఓ వెబ్ సీరిస్ లోనూ గౌరవ్ నటించాడు. టీవీయస్ ఐ క్యూబ్, బజాజ్ ఫ్రీడమ్, సపోలా ఆయిల్, ఆక్వా గార్డ్, టాటా క్యాపిటల్ కు సంబంధించిన యాడ్ ఫిలిమ్స్ లో గౌరవ్ నటించాడు.

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 5/8

ఢిల్లీలో ఉంటున్న గౌరవ్ బోరాకు నటన కాకుండా వంట చేయడం, ఈత కొట్టడం, ట్రెక్కింగ్ కు వెళ్ళడమంటే ఇష్టం! 'మిరాయ్'లో శ్రీరాముడి పాత్ర కోసం అతనిపై రెండు రోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఆ పాత్రను మరింత గొప్పగా ఎలివేట్ చేయటం కోసం దానికి వి.ఎఫ్.ఎక్స్. జోడించి అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. 

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 6/8

'మిరాయ్' సినిమా క్లయిమాక్స్ లో శ్రీరాముడి పాత్ర తెర మీద కనిపించగానే థియేటర్లోని ప్రేక్షకులందరికీ ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి. జై శ్రీరామ్ అనే నినాదాలు మిన్నుముట్టాయి. 

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 7/8

అక్కడ నుండి సినిమాను శ్రీరాముడే ముందుకు తీసుకెళ్ళిపోయినట్టుగా అయ్యింది. ఈ సినిమా రేంజ్ పెరగడానికి గౌరవ్ బోరా పోషించిన శ్రీరాముడి పాత్ర ఎంతో ఉపయోగపడిందనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట.

Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు 8/8

మరి 'మిరాయ్'లో కనిపించీ, కనిపించనట్టుగా ఉన్న గౌరవ్ బోరా... తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటాడేమో చూడాలి.

Updated at - Sep 14 , 2025 | 03:15 PM