Peddi Movie: దీపావళికి ‘పెద్ది’ ధమాకా.. దర్శకుడు హింట్..
ABN, Publish Date - Oct 16 , 2025 | 09:27 AM
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయిక. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సిక్సర్ కొట్టి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెంచేసింది.
రామ్‌చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Sana buchibabu) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ కథానాయిక. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సిక్సర్ కొట్టి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెంచేసింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఆ క్రేజ్ మరింత రెట్టింపు అయింది. దసరాకు వస్తుందనుకున్న ఫస్ట్ సింగిల్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు దీపావళికి దద్దరిలే అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తాజా అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు సానా బుచ్చిబాబు. ఆ కార్యక్రమంలో ‘పెద్ది’ విశేషాలేంటని యాంకర్ ప్రశ్నించగా త్వరలో మంచి లవ్ సాంగ్ ప్రేక్షకుల ముందుకురాబోతుందని. ఆ పాటకు సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ అదిరిపోయేలా మ్యూజిక్ ఇచ్చారని ఆయన చెప్పారు. ఆ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. అయితే ఈ పాట దీపావళికే వస్తుందని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దర్శకుడు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.