సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: పెద్ది.. మ‌రో అప్డేట్! స్టైలిష్‌గా.. ఢిల్లీ షెడ్యూల్ పూర్తి

ABN, Publish Date - Dec 27 , 2025 | 10:59 AM

రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

Peddi

రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’ (Peddi ) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన ఢిల్లీ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట, పార్లమెంట్‌ వంటి ఐకానిక్‌ ప్రదేశాల్లో గత కొన్ని రోజులుగా షూటింగ్‌ నిర్వహించారు. ఈ షెడ్యూల్‌ ముగింపును ప్రకటిస్తూ సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌. రత్నవేలు (R. Rathnavelu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీ షెడ్యూల్‌ను స్టైలిష్‌గా పూర్తి చేశాం. అత్యంత భావోద్వేగ భరితమైన, కవితాత్మకమైన దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించాం.

ఈ సన్నివేశాల్లో రామ్‌చరణ్‌ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో చరణ్‌ మునుపెన్నడూ చూడని మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. వృద్ది సినిమాస్‌ బేనర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Dec 27 , 2025 | 11:05 AM