సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: 'చికిరి' పాట‌ కోసం.. ఇంత చేశారా! తెర వెనుక దృశ్యాలు

ABN, Publish Date - Nov 27 , 2025 | 05:29 PM

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)కాంబోలో తెర‌కెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా రోజుకో ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తుంది.

Peddi

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)కాంబోలో తెర‌కెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా రోజుకో ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తుంది. ఇప్ప‌టికే గ‌తంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ అంచ‌నాలు మించి రెస్పాన్స్ ద‌క్కించుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌రీతంగా వైర‌ల్ అయింది.

తాజాగా దానిని త‌ల‌ద‌న్నుతూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన చికిరి చికిరి (Chikiri Chikiri) పాట అంకుమించి అనేలా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే 100 మిలియ‌న్స్ మించి వ్యూస్ క్రాస్ చేసి రికార్డులు నెల‌కొల్పింది. స్టిల్ ఇంకా సోష‌ల్ మీడియాలో హ‌వా సృష్టిస్తోంది. దీంతో సినిమా విడుద‌ల‌కు నాలుగు నెల‌ల స‌మ‌యం ఉండ‌గా అంచ‌నాలు మాత్రం అంత‌కంత‌కు ఆకాశ‌న్నంటుతున్నాయి.

అయితే.. తాజాగా గురువారం ఈ చికిరి పాట‌కు సంబంధించిన బీహైండ్ సీన్స్ వీడియోను రిలీజ్ చేశారు. ముంబ‌య్ ద‌గ్గ‌ర్లోని ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేని ప్ర‌కృతి అందాల నడుమ, ఎత్తైన లోయ‌లు, గుట్ట‌లపై ఈ పాటను చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.

ఇందుకోసం వారు ప‌డిన క‌ష్టం, తాప‌త్ర‌యం దాదాపు గంట‌సేపు చేసిన ట్రెక్కింగ్ చేసిన దృశ్యాల‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా సినిమా యూనిట్ క‌ష్టానికి హ్యాట్సాప్ చెబుతున్నారు. ప్రాణాల‌కు తెగించి ఎలారా ఇంత ఫీట్ చేశారు అని హీరో, ఇత‌ర టీంను కొనియాడుతున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 05:40 PM