Peddi: ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంట.. రాసిపెట్టుకోండి ఇక రచ్చ రచ్చే
ABN, Publish Date - Oct 08 , 2025 | 09:08 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే.
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే. అందుకోసమే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది (Peddi) సినిమాను మొదలుపెట్టాడు. వృద్ధి సినిమాస్ మరియు IVY ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ హైప్ ను తీసుకొచ్చిపెట్టాయి.
మొదటి నుంచి కూడా పెద్ది సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్న విషయం తెల్సిందే. అందుకు తగ్గట్టుగానే బుచ్చి కూడా సినిమాను వేరే లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందట. ఫస్ట్ హాఫ్ అవుట్ ఫుట్ అదిరిపోయిందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా అయ్యిందని, అవుట్ ఫుట్ తో రామ్ చరణ్ ఫుల్ హ్యాపీ అని సమాచారం. రేపటి నుంచి పూణెలో చరణ్ - జాన్వీపై సాంగ్ షూట్ మొదలుకానుంది. ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.
పెద్దికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సిద్దమవుతుంది. మ్యూజిక్ పరంగా పెద్ది బ్లాక్ బస్టర్ అవుతుందని, రెహమాన్ మ్యూజిక్ అదరగొట్టాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఏదిఏమైనా ఈసారి పెద్ది సినిమాతో చరణ్ భారీ హిట్ ను అందుకుంటాడు అనేది మాత్రం పక్కా అని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే పెద్ది నుంచి ఏ అప్డేట్ వచ్చినా రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ అంచనాలను చరణ్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Kantara Chapter 1: సినిమాకు ప్రాణంగా నిలిచిన బ్రహ్మ కలశ వీడియో సాంగ్ వచ్చేసింది..
Kalyani Priyadarshan: లోక తరువాత ఇలానా.. ఛఛ అస్సలు ఊహించలేదే