సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Charan: నా హీరో మీరే

ABN, Publish Date - Aug 23 , 2025 | 04:55 AM

శుక్రవారం చిరంజీవి 70వ జన్మదినోత్సవ వేడుకలు సింగపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో..

శుక్రవారం చిరంజీవి 70వ జన్మదినోత్సవ వేడుకలు సింగపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగాయి. చిరంజీవితో రామ్‌చరణ్‌ కేక్‌ కట్‌ చేయించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘నాన్నా... నా హీరో, మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత మీరే. నా ప్రతి విజయం వెనుక మీరు ఉన్నారు. నేను పాటించే విలువలకు మూలం మీరు. 70 ఏళ్ల వయసులోనూ మీరు మాకు ప్రేరణగా నిలుస్తున్నారు. మీరు కలకాలం ఇలానే ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

అన్నగా నీ విజయాలను ఆస్వాదిస్తున్నా

గురువారం చిరంజీవికి పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలపగా ‘నీకు అన్నను అయినందుకు ఆనందంగా ఉందని’ చిరంజీవి స్పందించారు. కల్యాణ్‌... నువ్వు ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. అందులోని ప్రతి మాటా, అక్షరం నా హృదయాన్ని తాకాయి అని లేఖలో పేర్కొన్నారు. ‘నన్ను చూసి నువ్వెంత గ ర్వపడుతున్నావో, నీ విజయాలను, పోరాటాలను చూసి నేనూ అంతే సంతోషిస్తున్నాను. నమ్మినవాళ్లకు ఏదో చేయాలనే తపనే నీలో నూతనోత్సాహం నింపుతోంది. ఈ రోజు నీ వెనుక కోట్లాది జనసైనికులు ఉన్నారు. ఓ రాజువై ఆ సైన్యాన్ని నడిపించు. వాళ్ల ఆశలు, కలలకు కొత్త శక్తినివ్వు. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతో ఉంటాయి. నీ ప్రతి అడుగులో విజయం నిన్ను వరించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

Updated Date - Aug 23 , 2025 | 04:55 AM