సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Charan: గ్లోబల్ స్టార్ ట్యాగ్ తొలగించిన రామ్ చరణ్.. కారణం అదేనా

ABN, Publish Date - Nov 02 , 2025 | 07:07 PM

ఇండస్ట్రీలో నట వారసుడిగా కెరీర్ ను ప్రారంభించి వారికంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవడం ప్రతి హీరోకు చాలా ఒత్తిడితో కూడుకున్న పని.

Ram Charan

Ram Charan: ఇండస్ట్రీలో నట వారసుడిగా కెరీర్ ను ప్రారంభించి వారికంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవడం ప్రతి హీరోకు చాలా ఒత్తిడితో కూడుకున్న పని. తండ్రి పెద్ద స్టార్ హీరో.. కొడుకు ఏ రేంజ్ లో ఉంటాడో అని మొదటి నుంచి అభిమానులు అంచనాలను పెట్టుకుంటూ ఉంటారు. ఇక మొదటి సినిమా నుంచి తన సొంత ఐడెంటిటీ పొందే వరకు ఏ చిన్న తప్పు జరిగినా.. అంతా తండ్రినే ట్రోల్ చేస్తారు. అలా తండ్రి పేరు చెడగొట్టకుండా సొంత కాళ్ల మీద నిలబడడం చాలా కష్టంతో కూడుకున్న పని. అంత కష్టతరమైన పనిని కూడా పట్టుదలతో సాధ్యం చేసుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan).

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో అడుగుపెట్టి.. మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ తో ఎదిగి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే ఇప్పుడు కొంప ముంచింది. ట్యాగ్స్ పెరిగే కొద్దీ.. అభిమానులలో అంచనాలు ఇంకా పెరుగుతాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వలేని రోజు.. ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చరణ్ కూడా ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నాడా అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్.. గ్లోబల్ స్టార్ గా మారాడు. గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ నే వాడారు. ఆ సినిమాపై అందరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అందరికీ తెల్సిందే. కానీ, చరణ్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో విమర్శలు పాలయ్యాడు. రీచ్ కోసం పెట్టుకున్న బిరుదు ట్రోల్స్ ను మరింత ఎక్కువ చేసింది. అది చరణ్ ఫ్యాన్స్ ను బాగా ఇబ్బంది పెట్టింది. కొత్తది అవసరం లేదు.. పాత బిరుదును మెయింటైన్ చేస్తే చాలు అని సలహాలు ఇచ్చారు.

ఇక అభిమానుల సలహాలను చాలా సీరియస్ గా తీసుకున్న చరణ్.. పెద్ది సినిమాకు తన పాత ట్యాగ్ తోనే దర్శనమిచ్చాడు. తండ్రి బిరుదులోని మెగా.. బాబాయ్ బిరుదులోని పవర్ ను కలిపి మెగా పవర్ స్టార్ గా చరణ్ కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడు. నిజం చెప్పాలంటే ఇలాంటి ట్యాగ్స్ హీరోలు వద్దు అనుకోవడం ఎంతో ఉత్తమం. కొంతవరకు చరణ్ కు ఇది పాజిటివీటిని తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. ఏదిఏమైనా గ్లోబల్ రీచ్ వచ్చినప్పుడు ఇలాంటి ట్యాగ్స్ బావుంటాయి కానీ, ఇప్పుడు అవసరం లేదు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 07:15 PM