Manchu Manoj: అన్న ప్రభాస్ ని వాడితే.. తమ్ముడు చరణ్ ని వాడుతున్నాడుగా
ABN, Publish Date - Dec 15 , 2025 | 07:42 PM
మిరాయ్ (Mirai) సినిమా మంచు మనోజ్ (Manchu Manoj) జీవితాన్ని మార్చేసింది అని చెప్పొచ్చు. అందులో మనోజ్ విలనిజాన్ని ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Manchu Manoj: మిరాయ్ (Mirai) సినిమా మంచు మనోజ్ (Manchu Manoj) జీవితాన్ని మార్చేసింది అని చెప్పొచ్చు. అందులో మనోజ్ విలనిజాన్ని ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తేజ హీరో అయ్యినప్పటికీ మనోజ్ కోసమే చాలామంది సినిమాకు వెళ్లారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక మిరాయ్ తరువాత మనోజ్ కి వరుస అవకాశాలు తలుపు తత్తయ్యి. చిరు - బాబీ కాంబోలో వస్తున్న చిత్రంలో మనోజ్ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఒకపక్క విలన్ గా నటిస్తూనే ఇంకోపక్క హీరోగా కూడా మనోజ్ సినిమాలు చేస్తున్నాడు. అలా మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం డేవిడ్ రెడ్డి. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఏ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్ మరియు నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఏ చిత్రం నుంచి టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ కథ 1897-1922 కాలంలో జరుగుతుందని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక వ్యక్తి కథ అని పోస్టర్ లో రాయడంతో ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించిన కథ అని తెలుస్తోంది.
ఇక మనోజ్ ఈ సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. దీనికోసం తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ని రంగంలోకి దింపినట్లు సమాచారం. మనోజ్ కి టాలీవుడ్ లో చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో బెస్ట్ అంటే రామ్ చరణ్ అని చెప్పొచ్చు. చాలాసార్లు మనోజ్ కూడా చరణ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. ఇక తమిళ్ స్టార్ హీరో శింబు అయితే.. ఎక్కువ మనోజ్ ఇంట్లోనే కనిపిస్తాడు. మంచు ఫ్యామిలీలో శింబు కూడా ఒకడు అని చెప్పొచ్చు. మనోజ్ కోసం ఇప్పటికే శింబు సాంగ్స్ కూడా పాడాడు.
ఇప్పుడు మనోజ్ కోసం.. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ డేవిడ్ రెడ్డి సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ కనిపించనున్నారట. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలే కాబట్టి స్టార్ హీరోలు చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని అనుకోని మనోజ్.. ముందుగా తన ఇద్దరు ఫ్రెండ్స్ నే అప్రోచ్ అయ్యినట్లు టాక్. శింబు ఇప్పటికే ఓకే చెప్పగా.. చరణ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని వినికిడి. త్వరలోనే చరణ్ కూడా ఓకే చెప్తాడని అంటున్నారు. ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏదేమైనా స్టార్ హీరోల స్నేహాన్ని వాడుకోవడం మంచు బ్రదర్స్ కు బాగా తెలుసు. అన్న విష్ణు కన్నప్ప కోసం ప్రభాస్ ని వాడితే.. ఇప్పుడు తమ్ముడు మనోజ్ డేవిడ్ రెడ్డి కోసం చరణ్ ని వాడుతున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.