Rakesh Jagarlamudi: వేవ్స్ ఓటీటీలో 'ఖుదీరాం బోస్' చిత్రం...

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:09 PM

రాకేశ్‌ జాగర్లమూడి టైటిల్ రోల్ ప్లే చేసిన 'ఖుదీరాం బోస్' వివిధ భాషల్లో ఇప్పుడు వైవ్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Khudiram Bose Movie

రాకేశ్‌ జాగర్లమూడి (Rakesh Jagarlamudi) టైటిల్ రోల్ ప్లే చేసిన పాన్ ఇండియా మూవీ 'ఖుదీరాం బోస్' (Khudiram Bose). భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను చిరునవ్వుతో అర్పించిన అమరవీరుడి గాథ ఇది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ (Uttej) కు చెందిన మయూఖ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన అనంతరం రాకేశ్‌ ఈ సినిమాలో నటించాడు. 2022లో ఈ సినిమా గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితమైంది. అలానే అదే యేడాది డిసెంబర్ లో న్యూ ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రద్శించారు. కమర్షియల్ గా ప్రజల దగ్గరకు ఈ సినిమాను తీసుకెళ్ళడంలో విఫలమయ్యానని నిర్మాత విజయ్ జాగర్లమూడి (Vijay Jagarlamudi) వాపోతుండేవారు. అయితే... ఇప్పుడీ సినిమాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక ఓటీటీ వేవ్స్ లో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలియచేస్తూ, చిత్రబృందాన్ని అభినందించారు.


'ఖుదీరాం బోస్' సినిమాలో అతుల్ కులకర్ణి, నాజర్, వివేక్ ఓబెరాయ్, రవిబాబు, కాశీ విశ్వనాథ్‌ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నటుడు బాలాదిత్య (Baladitya) ఈ సినిమాకు రచన చేయగా, మణిశర్మ సంగీతం అందించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత తోట తరణి (Thota Tarani) ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కన్నల్ కణ్ణన్ ఫైట్స్ సమకూర్చిన ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాను విద్యాసాగర్ రాజు తెరకెక్కించారు.

Also Read: Varanasi: ‘అవతార్‌-3’తో రాజమౌళి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌..

Also Read: Amara Kavyam Trailer: నా జీవితం నాశనమయ్యింది ఈ ప్రేమ వల్లే.. ధనుష్ అదరగొట్టాడు

Updated Date - Dec 05 , 2025 | 04:13 PM