సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆగస్టులో రాజుగాని సవాల్‌

ABN, Publish Date - Jul 10 , 2025 | 06:02 AM

అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో మానవ సంబంధాలను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగే చిత్రం ‘రాజుగాని సవాల్‌’. లెలిజాల రవీందర్‌ స్వీయ దర్శకత్వంలో...

అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో మానవ సంబంధాలను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగే చిత్రం ‘రాజుగాని సవాల్‌’. లెలిజాల రవీందర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రితికా చక్రవర్తి కథానాయిక. ఇటీవలే చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో నటుడు జగపతి బాబు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లెలిజాల రవీందర్‌ మాట్లాడుతూ ‘ఆగస్టు 8న ‘రాజుగాని సవాల్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చిత్రం ఇది. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సాగుతుంది. వినోదంతో పాటు పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు.

Updated Date - Jul 10 , 2025 | 06:02 AM