సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anaganaga Oka Raju: రాజుగారి పెళ్లిరో.. ఊరూవాడా లొల్లిరో.. సాంగ్ అదిరిందిరో

ABN, Publish Date - Dec 26 , 2025 | 06:34 PM

నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) జంటగా మారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju).

Anaganaga Oka Raju

Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) జంటగా మారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులను దాటుకొని సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా అనగనగా ఒక రాజు చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజుగారి పెళ్లిరో అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

రాజుగారి పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుంది అనేది ఈ సాంగ్ లో చూపించారు. పెళ్లి కొడుకుగా నవీన్.. పెళ్లి కూతురుగా మీనాక్షీ కనిపించారు. ఇక పెళ్లి సాంగ్ ఎలా ఉంటుందో ఈ సాంగ్ కూడా అలాగే ఉంటుంది. మొదటి నుంచి డబ్బున్న రాజుగారు తన పెళ్లి ఎలా జరగాలని కోరుకున్నారో.. అలాగే ఈ లిరిక్స్ లో వినిపించారు లిరిసిస్ట్ చంద్రబోస్. ఇక ఆ లిరిక్స్ ని తమ గాతరంతో ఆలపించి మెస్మరైజ్ చేశారు సింగర్స్ అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపించింది.

ఇక నవీన్, మీనాక్షీ జంట చూడచక్కగా ఉంది. మొదట మీనాక్షీ ప్లేస్ లో శ్రీలీలని తీసుకున్నారు. కొన్ని కారణాల వలన ఆమె ప్లేస్ ను మీనాక్షీ రీప్లేస్ చేసింది. మీనూ కూడా నవీన్ పక్కన ఎంతో అందంగా కనిపించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి నవీన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 26 , 2025 | 06:34 PM