సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Biker: ‘బైకర్‌’ ఖర్చు చూసి.. భయం వేసేది! స్టంట్స్ అన్నీ ఒరిజినల్‌

ABN, Publish Date - Nov 02 , 2025 | 08:02 AM

శర్వానంద్‌ హీరోగా అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన స్పోర్ట్స్‌ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్‌’.

Biker

శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా అభిలాష్‌రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ (UV Creations) నిర్మించిన హై-స్పీడ్‌ స్పోర్ట్స్‌ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్‌’ (Biker). వ‌చ్చే నెల 6న విడుదలవుతోంది. శనివారం జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ ‘భారతీయ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి మోటోక్రాస్‌ రేసింగ్‌ ఫిల్మ్‌ మాదేనని గర్వంగా చెబుతున్నా. నా సినీ కెరీర్‌లో ఈ చిత్రం ఓ టర్నింగ్‌ పాయింట్‌. ఇందులో కనిపించిన స్టంట్స్‌ ఏవీ సీజీ కాదు. ఒరిజినల్‌ బైకర్స్‌తో ఇండోనేషియా వెళ్లి రిస్కీగా షూట్‌ చేసి వచ్చాం. ఇంత గొప్ప సినిమా తీయాలంటే నిర్మాతలకు ధైర్యం ఉండాలి. వంశీ అన్నకు థాంక్స్‌. ఇది నా సినిమా అని గర్వపడే ప్రాజెక్ట్‌’ అని చెప్పారు.


రాజశేఖర్ (Rajasekhar) మాట్లాడుతూ ‘నా మనసుకు నచ్చిన సబ్జెక్ట్‌ ‘బైకర్‌’. హీరోగా దాదాపు వంద సినిమాలు చేసాను.. హీరోగా మాత్రమే కాకుండా మంచి పాత్రలొస్తే చేద్దామని అనుకున్నా. కథలు నచ్చక చాలా సినిమాలు చేయలేదు. అలా నేను డిసప్పాయింట్ గా ఉన్న టైమ్ లో 'బైకర్' కథ నా దగ్గరకొచ్చింది. అభిలాష్‌ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా డిజైన్‌ చేశారు. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు చూసి నాకు భయం వేసేది. కానీ వంశీ గారు మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. శర్వా నా నటనను మెచ్చుకోవడం నాకు అవార్డుతో సమానం’ అని చెప్పారు.

అభిలాష్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇక్కడ గెలవడం గొప్ప కాదు చివరి దాకా పోరాడడం గొప్ప అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రేసింగ్‌ సినిమాలు చూసిన ఎగ్జైట్‌మెంట్‌కు మించి ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’ అని తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 11:19 AM