Sunny Sanskari Ki Tulsi Kumari: జాన్వీ కపూర్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Sep 15 , 2025 | 02:59 PM
వరుణ్ దావణ్ హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సాన్య మల్హోత్ర, రోహిత్ సారఫ్ నటించిన చిత్రం సన్నీ సన్ స్కారీ కి తుల్సీ కుమారి.
బేబీ జాన్ డిజాస్టర్ తర్వాత వరుణ్ దావణ్ (Varun Dhawan) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సాన్య మల్హోత్ర (Sanya Malhotra), రోహిత్ సారఫ్ (Rohit Saraf ) జంటలుగా నటించిన చిత్రం సన్నీ సన్ స్కారీ కి తుల్సీ కుమారి (Sunny Sanskari Ki Tulsi Kumari). కరణ్ జోహర్ ధర్మ ప్రోడక్షన్స్ (Dharma Productions) నిర్మించగా శశాంక్ కైతాన్ (Shashank Khaitan) దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆక్టోబర్2న థియేటర్లకు వస్తోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకు వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలలో వేగం పెంచిన మూవీ టీం తాజాగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ను గమనిస్తే.. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ జానర్‌లో సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది.
అప్పటివరకు లవర్స్ గా ఉన్న వరుణ్, సాన్య విడిపోవడం తిరిగి వారు ఇతరులతో రిలేషన్‌లోకి రావడం అప్పుడు ఒక జంట మరో జంటను టీజ్ చేసే నేపథ్యంగా మూవీ ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ట్రైలర్ ఆరంభమే బాహుబలి కాన్పెస్ట్ తీసుకోవడం కాస్త భిన్నంగా, ఫన్ పంచేలా ఉంది. చూడాలి మరి ఈ సన్నీ సన్ స్కారీ కి తుల్సీ కుమారి (Sunny Sanskari Ki Tulsi Kumari) సినిమా అయినా జాన్పీ, వరుణ్ లకు విజయం అందిస్తుందో లేదో.