సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajamouli: జక్కన్నపై మళ్ళీ కాపీ ఆరోపణలు

ABN, Publish Date - Nov 07 , 2025 | 07:29 PM

మొత్తానికి ఒక అప్డేట్ వచ్చింది.. అది కూడా సూపర్ స్టార్ హ్యాండిల్ నుంచి .. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ నుంచి.. అసలే మోస్ట్ అవెయిటెడ్ మూవీ.. మరి అప్డేట్ వస్తే అభిమానులు ఊరుకుంటారా.. రచ్చ రచ్చ చేస్తున్నారు.ప్లస్సులు, మైనస్సులతో హంగామా చేస్తున్నారు.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న మూవీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ గురించి అప్డేట్స్ కోసం అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ చేశారే తప్ప.. ఇంత వరకు అధికారికంగా ఒక్క విషయాన్న బయటకు చెప్పలేదు. మహేశ్ బాబు బర్త్ డే రోజు ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడినప్పటికి సెమీ పోస్టర్ తో సరిపెట్టాడు జక్కన్న. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయినప్పటికి అప్పుడప్పుడు ఏవో వీడియోలు, ఫోటోలు మాత్రమే లీక్ అవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా అఫీషియల్ గా బయటకు వదిలిన ఓ క్రేజీ అప్డేట్ కు కాపీ మరకలు అంటుకున్నాయి.


మామూలుగానే రాజమౌళి సినిమాలకు ఎక్కవుగా కాపీ ఆరోపణలు ఎదురువుతుంటాయి. ఇప్పటికే చాలా సినిమాలపై ఆ ముద్ర పడింది. ఇప్పుడు అదే బాటలో మహేశ్ చేరడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా బయటకు వచ్చిన పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇందులో ‘కుంభ’ అనే పాత్రలో పృథ్వీరాజ్ దివ్యాంగుడిగా కనిపిస్తూ, రోబోటిక్ భుజాలతో భయానక రూపంలో ఉన్నాడు. ఈ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు గతంలో వచ్చిన కొన్ని హీరోల వీల్‌చైర్ లుక్‌లతో, రోబో భుజాలను సూపర్ హీరో సినిమాలతో కంపేర్ చేస్తున్నారు. జక్కన్న మళ్లీ కాపీ కొట్టారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. పృథ్వీ రాజ్ లుక్.. 'క్రిష్ 3' సినిమాలో వివేక్ ఒబెరాయ్ లా ఉందని కొందరు... '24' మూవీలో సూర్య వీల్ చైర్ ను పోలి ఉందని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్ ముగ్గురూ ఈ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. రాజమౌళి వీరి కాంబోలోని సీక్వెన్స్‌లను హాలీవుడ్ రేంజ్‌లో రూపొందిస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు నవంబర్ 15న ‘ 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఖర్చుతో గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు తరలిరానున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాక ఈ ఈవెంట్ లో సినిమా పేరు, లేదా మహేశ్ లుక్ విడుదల అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. పృథ్వీరాజ్ లుక్ తో ట్రోల్స్ ఎదుర్కొంటున్న జక్కన్న నెక్ట్స్ పోస్టర్లపై ఎలాంటి జాగ్రత్త తీసుకుంటాడో చూడాలి.

Read Also: Samantha: బాయ్ ఫ్రెండ్ బిగి కౌగిలిలో సమంత.. సాహసోపేతమైన అడుగు అంటూ పోస్ట్

Read Also: Indian Panorama: గోవాలో సంక్రాంతికి వస్తున్నాం....

Updated Date - Nov 07 , 2025 | 07:49 PM