సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Globe Trotter Event: ఎంట్రీ.. వాళ్ల‌కు మాత్ర‌మే! క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి

ABN, Publish Date - Nov 13 , 2025 | 12:26 PM

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై దర్శకుడు రాజమౌళి వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ వేడుక జరుగుతుందని, కాకపోతే ఆహ్వానితులు పోలీసు వారు ఇచ్చిన సూచనలను పాటించాలని రాజమౌళి చెప్పారు.

Globe Trotter event

ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఉంటుందా ఉండదా? అనే చర్చ రెండు రోజులుగా జరుగుతోంది. వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని జియో హాట్ స్టార్ తో ఈ ఈవెంట్ ను రాజమౌళి బృందం ప్లాన్ చేసింది. నవంబర్ 15వ తేదీకి ఈ మూవీపై హైప్ పెంచుతూ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వస్తోంది. ఇప్పటికే శ్రుతీహాసన్ (Shruthi Haasan) పాడిన పాటను రివీల్ చేసిన టీమ్, తాజాగా ప్రియాంక చోప్రా (Priayanka Chopra) లుక్ ను సైతం విడుదల చేసింది. ఇదిలా ఉంటే... ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ నేపథ్యంలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఉండకపోవచ్చుననే ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది. దీనికి రాజమౌళి తెర దించారు. ఖచ్చితంగా ఈ వేడుక ఉంటుందని హామీ ఇచ్చారు. కాకపోతే... ఇది పబ్లిక్ ఫంక్షన్ కాదని, కేవలం ఆహ్వానితులకు మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుందని, రామోజీ ఫిల్మ్ సిటీకి ఎవరు ఏ మార్గం గుండా రావాల్సి ఉంటుందనే విషయంలో రాజమౌళి ఓ వీడియో ద్వారా వివరించారు.


పోలీసు శాఖ విధించిన ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని తాము కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రాజమౌళి తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు, పెద్ద వారికి ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. వారంతా జియో హాట్ స్టార్ లో చూసి ఆనందించవచ్చని చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గెట్ ను నవంబర్ 15వ తేదీ మూసి వేస్తున్నారని, దానికి ముందు, దాని తర్వాత ఉన్న మార్గాల ద్వారా ఈవెంట్ కు ఆహ్వానితులు రావాల్సి ఉంటుందని, వీలైనంత ముందుగా వస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు క్రమశిక్షణతో మెలగకపోతే కార్యక్రమం రద్దు అయ్యే ఛాన్స్ కూడా ఉందని రాజమౌళి పరోక్షంగా హెచ్చరించారు. సో... మహేశ్ బాబు అభిమానులు, సినిమాను ప్రేమించే వారు ఏ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొని, ఏ స్థాయిలో దీనిని విజయ వంతం చేస్తారో చూడాలి.

Updated Date - Nov 13 , 2025 | 12:35 PM