సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

HHVM: విశాఖలో వీరమల్లు ఈవెంట్‌.. అతిథులుగా వచ్చేది వారే

ABN, Publish Date - Jul 14 , 2025 | 09:38 AM

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ నెల 24న థియేటర్లలో రానున్న సంగతి తెలిసిందే. దానికి ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక భారీగా నిర్వహించనున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. 50 శాతం క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కగా, మిగతా భాగాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ నెల 24న థియేటర్లలో రానున్న సంగతి తెలిసిందే. దానికి ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక భారీగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. తొలుత ఈ ఈవెంట్‌ తిరుపతి లేదా విజయవాడలో ప్లాన్‌ చేశారు. అయితే ఇప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో చేయడం లేదని తెలిసింది.

విశాఖ సాగర తీరాన అభిమానుల సమక్షంలో భారీగా నిర్వహించనున్నారట. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆస్కార్‌ విన్నర్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  రాజమౌళికి  అయన  సోదరుడు కావడం, పవన్‌ కళ్యాణ్‌ అంటే జక్కన్నకు గౌరవం ఉండటంతో అయన ఈ వేడుకకు అతిధిగా వస్తున్నారని సమాచారం. ఇక త్రివిక్రమ్‌, పవన్‌ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే ఈ ఇద్దరినీ ఎ.ఎం.రత్నం గెస్ట్‌లుగా ఆహ్వానించారని తెలిసింది.

ఇటీవల  ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. అప్పటి నుంచి సినిమాకు మరింత క్రేజ్‌ ఏర్పడింది. అన్ని ఏరియాల నుంచి బిజినెస్‌ ఆఫర్స్‌ వస్తున్నాయని తెలిసింది.  పవన్‌ కళ్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ విలన్‌గా ఔరంగజేబు పాత్రలో నటించారు. అనుపమ్‌ ఖేర్‌,  సత్యరాజ్‌, బెంగాలీ సేన్  గుప్తా, సునీల్‌, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రధారులు. నోరా ఫతేహి ఒక ప్రత్యేక పాత్రలో నటించారు.

Updated Date - Jul 14 , 2025 | 11:29 AM