Raj Tharun: నిన్న చిరంజీవ... రేపు పాంచ్ మినార్...
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:52 PM
రాజ్ తరుణ్ నటించిన 'చిరంజీవ' మూవీ శుక్రవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఓ వారం గ్యాప్ లో అతని మరో సినిమా 'పాంచ్ మినార్' థియేటర్లలో సందడి చేయబోతోంది.
హీరో రాజ్ తరుణ్ (Raj Tharun) ఇప్పుడిప్పుడే వ్యక్తిగత సమస్యల నుండి బయట పడుతున్నాడు. అవన్నీ పీక్ లో ఉండగానే రాజ్ తరుణ్ గత సంవత్సరం ఏకంగా నాలుగు సినిమాల్లో చేశాడు. అందులో నాగార్జున (Nagarjuna) తో కలిసి నటించిన 'నా సామిరంగ' (Naa Saami Ranga) ఒకటి కాగా మిగిలిన మూడూ సోలో హీరోగా నటించినవే. అయితే 'నా సామిరంగ' తప్పితే మిగిలిన సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. దాంతో ఈ యేడాది రాజ్ తరుణ్ మూవీ ఒక్కటీ ఈ మధ్య కాలం వరకూ విడుదల కాలేదు. అయితే... గత శుక్రవారం రాజ్ తరుణ్ నటించిన 'చిరంజీవ' (Chiranjeevia) మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.
గతంలో కరోనా సమయంలో రాజ్ తరుణ్ మూవీస్ 'ఒరేయ్ బుజ్జిగా' (Orey Bujjiga), 'పవర్ ప్లే' (Power Play) ఓటీటీలోనే వచ్చాయి. మళ్ళీ ఈ యేడాది 'చిరంజీవ' స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఈ యేడాది ప్రథమార్ధంలో విడుదల కావాల్సి ఉండి చివరి నిమిషంలో ఆగిపోయిన 'పాంచ్ మినార్' (Panch Minar) అనే కామెడీ మూవీని ఈ నెల 21న మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఓటీటీలో కాకుండా డైరెక్టర్ గా నవంబర్ 21న థియేటర్లలోనే విడుదల చేస్తామంటున్నారు. రాశి సింగ్ హీరోయిన్ నటించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ను రామ్ కుడుముల డైరెక్ట్ చేశాడు. గోవింద రాజు సమర్పణలో మాధశి, ఎంఎస్ఎం రెడ్డి దీన్ని ప్రొడ్యూస్ చేశారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. పది నెలల పాటు సినిమాలే లేని రాజ్ తరుణ్ ఇప్పుడీ 11వ నెలలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో అలరించడం అతని అభిమానులను ఆనందపరిచే విషయమే.
Also Read: Vijay: సత్తా చాటుతున్న జన నాయగన్...
Also Read: Dharmendra: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషమం.. స్పందించిన టీమ్