సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Paanch Minar Trailer: డబ్బు కోసం రాజ్ తరుణ్ కష్టాలు.. అన్ని ఇన్ని కావు

ABN, Publish Date - Nov 16 , 2025 | 08:20 PM

కుర్ర హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. సినిమాలు తీస్తున్నాడు కానీ, విజయాలు మాత్రం దక్కడం లేదు.

Paanch Minar

Paanch Minar Trailer: కుర్ర హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. సినిమాలు తీస్తున్నాడు కానీ, విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ మధ్యనే ఓటీటీలో చిరంజీవ సినిమాతో వచ్చాడు. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు పాంచ్ మినార్ (Paanch Minar) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రాజ్ తరుణ్, రాశీ సింగ్ జంటగా రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం పాంచ్ మినార్. కనెక్ట్ మూవీస్ బ్యానర్ పై గోవిందా రాజులు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 21 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చదువు అబ్బని ఒక కుర్రాడు ఏదో ఒక ఉద్యోగం చేయాలనీ నానా కష్టాలు పడుతుంటాడు. కానీ, అతనికి ఏ ఉద్యోగం రాదు. జాబ్ లేకపోవడంతో అటు లవర్ తో.. ఇటు ఫ్యామిలీతో తిట్లు తింటూ ఉంటాడు. వచ్చిన ఉద్యోగం కూడా ఎక్కువ రోజులు ఉండదు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఒక కేసులో ఇరుక్కుంటాడు. డబ్బు ఉన్న ఒక బ్యాగ్ అనుకోకుండా ఆ యువకుడు వద్దకు వచ్చి చేరుతుంది. దాని తరువాత అతని జీవితం ఎలా మారింది.. ? ఆ బ్యాగ్ వెనుక కథ ఏంటి.. ? పాంచ్ మినార్ అంటే అర్ధం ఏంటి.. ? అనేది సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. సినిమా మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 16 , 2025 | 08:20 PM