సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha-Raj: స‌మంతతో డేటింగ్‌.. పోస్టుల‌తో రాజ్ భార్య ర‌చ్చ‌

ABN, Publish Date - Jun 20 , 2025 | 01:41 PM

స‌మంత, ద‌ర్శ‌క నిర్మాత రాజ్‌నిడిమోరు మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా న‌డుస్తున్న వ్యవ‌హారంపై రోజురోజుకు ఊహాగానాలు అధిక‌మ‌వుతునే ఉన్నాయి.

samantha

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ స‌మంత (Samantha), ద‌ర్శ‌క నిర్మాత రాజ్‌నిడిమోరు (Raj Nidimoru) మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా న‌డుస్తున్న వ్యవ‌హారంపై రోజురోజుకు ఊహాగానాలు అధిక‌మ‌వుతునే ఉన్నాయి. ఇంత‌వ‌ర‌కు వారిపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఇద్ద‌రు రెస్సాండ్ అవ‌క‌పోవ‌డం, మ‌రోవైపు రాజ్ శ్రీమ‌తి శ్యామాలి (Shhyamali De) సోష‌ల్‌మీడియాలో పెడుతున్న పోస్టులు సంచ‌ల‌నం అవుతున్నాయి.

కొద్ది రోజుల‌ క్రితం.. ‘కాలం అన్నింటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది’ అని శ్యామాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆమె మ‌ళ్లీ రెండు మూడు సంద‌ర్భాల్లోనే ఆ త‌ర‌హాల‌నే పోస్టులు చేసింది. తాజాగా న‌మ్మ‌కం ఎంతో ఖ‌రీదైన డ‌బ్బు వంటిది, ఒక్క‌సారి దానిని పొగొట్టుకుంటే తిరిగి సంపాదించ‌లేం అంటూ కోటేష‌న్లు షేర్ చేసింది.

దీంతో నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు స‌మంత‌, రాజ్‌ల‌పై వ‌స్తున్న వార్త‌లు రూమ‌ర్సే అని అనుకున్న వారిని కూడా ఇప్పుడు ఆలోచించేలా చేస్తున్నాయి. నిజంగానే వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ ఏదో న‌డుస్తుంది లేకుంటే రాజ్ భార్య అలా పోస్టులు ఎందుకు పెడుతుందంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిప్ప‌ట్లో తెగేది కాదు సీరియ‌ల్ లాగానే సాగుతుంద‌ని, ముసుగులో గుద్దులాట ఎందుకు ఇప్ప‌టికే చాలామంది సెల‌బ్రిటీల విష‌యంలో జ‌రిగింద‌ని, ఏదైనా ఉంటే బ‌య‌ట పెడితే స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌స్తుంది క‌దా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలాఉంటే స‌మంత ఇప్ప‌టికే రాజ్ డైరెక్ష‌న్‌లో ఫ్యామిలీ మ్యాన్‌2 (The Family Man Season 2) పార్ట్ 1, పార్ట్‌3ల‌తో పాటు, ఆ మ‌ధ్య వ‌చ్చిన సిటాడెల్ హ‌నీ బ‌న్నీ (Citadel: Honey Bunny) వంటి సిరీస్‌ల‌లో న‌టించింది. ఇటీవ‌ల స‌మంత నిర్మాత‌గా మారి చేసిన శుభం (Shubham) సినిమాకు నిర్మాత‌ల్లో ఒకడిగా రాజ్ వ్య‌వ‌హరించ‌డం గ‌మ‌నార్హం. ఇదే కాకుండా రాజ్ నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ర‌క్త్‌బ్ర‌హ్మండ్ (Rakt Brahmand: The Bloody Kingdom) వెబ్ సిరీస్‌లో స‌మంత క‌థానాయుక‌గా న‌టిస్తోంది.

Updated Date - Jun 20 , 2025 | 03:44 PM