Samantha: మా ఇంటికి స్వాగతం వదినమ్మా.. రాజ్ చెల్లి ఎమోషనల్ పోస్ట్
ABN, Publish Date - Dec 03 , 2025 | 04:38 PM
ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా.. ఎన్ని విమర్శలు చేసినా నా జీవితం నా ఇష్టం అనుకోని స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ఎలాంటి హంగామా లేకుండా తాను ప్రేమించిన రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.
Samantha: ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా.. ఎన్ని విమర్శలు చేసినా నా జీవితం నా ఇష్టం అనుకోని స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ఎలాంటి హంగామా లేకుండా తాను ప్రేమించిన రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక గత మూడు రోజుల నుంచి సామ్ పెళ్లి ఫొటోలే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. రెడ్ కలర్ చీరలో సమంత కుందనపు బొమ్మలా మెరిసిపోతుంది.
ఇక సమంత.. రాజ్ కుటుంబం కూడా ఎంతో ప్రేమతో ఇంట్లోకి ఆహ్వానించింది. రాజ్ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను అతని సోదరి శీతల్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వదినమ్మను తన కుటుంబంలోకి ఆహ్వానించింది. ''చంద్రకుండ్ లోని శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నాను. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. గొప్ప భక్తుడు లింగాన్ని హత్తుకుంటే ఎంతలా ఆనందిస్తాడో నేనూ ఆ అనుభూతి పొందాను. ఆనందభాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. సమంత వచ్చాకా ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. ఈ జంటకు మేము ఎప్పుడు అండగా ఉంటాం' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
శీతల్ ఈ రేంజ్ గా ఎమోషనల్ అవ్వడం షాకింగ్ గా ఉందని నెటిజన్స్ అంటున్నారు. రాజ్ కుటుంబానికి కూడా సామ్ అంటే చాలా ఇష్టమని అర్ధమవుతుంది. రాజ్ మాజీ భార్య శ్యామాలీతో వీరి కుటుంబానికి కూడా గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా సమంత.. రాజ్ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.