సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha- Raj Marriage: బరితెగించిన వాళ్లు ఇలాగే చేస్తారు.. రాజ్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 01 , 2025 | 08:30 PM

సమంత (Samantha) పెళ్లి.. సమంత పెళ్లి.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక టాపిక్. సాధారణంగా అమ్మడు ఒక చిన్న ఫోటో పెడితేనే సోషల్ మీడియా షేక్ అవుతుంది.

Samantha- Raj Marriage

Samantha- Raj Marriage: సమంత (Samantha) పెళ్లి.. సమంత పెళ్లి.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక టాపిక్. సాధారణంగా అమ్మడు ఒక చిన్న ఫోటో పెడితేనే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఏకంగా పెళ్లి ఫోటోలు పెడితే టాప్ ట్రెండింగ్ అవ్వకుండా ఉంటుందా.. ? అదే జరిగింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను ఎంతో సింపుల్ గా పెళ్లి చేసుకున్న సామ్.. తమ పెళ్లి ఫోటోలను విడతల వారీగా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

ఇక సామ్ ని ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉండేవారికి ఈ న్యూస్ విందు భోజనం గా మారింది. అక్కినేని నాగ చైతన్య విడాకులను తీసుకొచ్చి సామ్ ను ఏకిపారేస్తున్నారు. ఇంకోపక్క చాలామంది సామ్.. ఒక మంచి కుటుంబాన్ని కూల్చేసిందని మండిపడుతున్నారు. రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలీ సైతం తన బాధను సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెళ్లగక్కుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబాన్ని సామ్ వచ్చి విడగొట్టిందని ఆమె ఇన్ డైరెక్ట్ గా పోస్టుల ద్వారా చెప్తూనే వచ్చింది.

తాజాగా శ్యామాలీ.. సామ్ - రాజ్ ల పెళ్లి గురించి ఒక పోస్ట్ పెట్టింది. ఆమెకు వీరి పెళ్లి గురించి ముందే తెలిసి ఉండొచ్చు. అందుకే గత రాత్రే ఆ పోస్ట్ చేసింది. బరితెగించినవాళ్లే.. ఇలా బరితెగించిన పనులు చేస్తారు అనే కోట్ ను పోస్ట్ చేసింది. దీంతో ఈకోట్ వారిద్దరి గురించే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రాజ్ కోసం శ్యామాలీ ఎప్పటి నుంచో పోరాడుతుంది. 2023 వరకు ఈ జంట కలిసే ఉన్నారు. ఇప్పటికీ వీరికి విడాకులు అయ్యాయా.. ? లేదా .. ? అనే విషయం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఏ ఈపోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Dec 01 , 2025 | 08:30 PM