Rahul Sipligunj: గాయకుడికి నగదు పురస్కారం.. సీఎం మాట నిలబెట్టుకున్నారు
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:46 PM
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో 'నాటు నాటు' పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది.
ALSO READ:
Indian Boxoffice: బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఓర్మాక్స్ నివేదిక ఎలా ఉందంటే...
Producer Naga Vamsi: హరిహర వీరమల్లును డిస్ట్రబ్ చేయం.. నాగవంశీ కామెంట్స్