Raghav Juyal: నాని సినిమాలో కిల్ విలన్
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:28 AM
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కిల్’, ‘గ్యారా గ్యారా’ చిత్రాల్లో...
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కిల్’, ‘గ్యారా గ్యారా’ చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించిన రాఘవ తెలుగులో నానితో కలసి స్ర్కీన్‌ను షేర్ చేసుకుంటున్నారు. గురువారం రాఘవ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఓ క్రేజీ వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. రాఘవను ఓ కొత్త లుక్‌లో, కొత్త పాత్రలో పరిచయం చేస్తూ ప్యారడైజ్ ప్రపంచంలోకి ఆహ్వానించింది. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బేనర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.