DJ Tillu: విమల్ కృష్ణ కొత్త సినిమా 'అనుమాన పక్షి'

ABN , Publish Date - Oct 03 , 2025 | 07:00 PM

రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'అనుమాన పక్షి'. ఈ సినిమాను 'డి.జె. టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

Rag Mayur New movie

'డి.జె. టిల్లు' (DJ Tillu) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రచయిత విమల్ కృష్ణ (Vimal Krishna). 2022లో ఈ సినిమా విడుదలై ఓవర్ నైట్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ను స్టార్ హీరోను చేసేసింది. ఆ తర్వాత కాస్తంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు విమల్ కృష్ణ మరో సినిమాను తెరకెక్కించాడు. అదే 'అనుమాన పక్షి' (Anumana Pakshi). ఇటీవల 'ఆ ఒక్కటి అడక్కు' (Aa Okkati Adakku) సినిమాను నిర్మించిన చిలకా ప్రొడక్షన్స్ సంస్థ నుండి వస్తున్న నాలుగో సినిమా ఇది.


'అనుమాన పక్షి' సినిమాను రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీ పేరును రివీల్ చేయడమే కాకుండా టైటిల్ రోల్ ప్లే చేస్తున్న రాగ్ మయూర్ లుక్ నూ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అనుమాన పక్షిగా నటిస్తున్న రాగ్ మయూర్ ఓ డిఫరెంట్ పర్సన్ అనేది ఈ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఓ కామిక్ బుక్ ను గుర్తు చేస్తోంది. చిలకా ప్రొడక్షన్ సంస్థకు కామిక్, యానిమేషన్స్ సీరియల్స్, సినిమాలు తీసిన అనుభవం ఉండటంతో ఈ సినిమాకూ అలాంటి ఓ సరికొత్త లుక్ ను అద్దారు. మోషన్ పోస్టర్‌లోని విజువల్స్, శ్రీ చరణ్ పాకాల (Sri Charan Pakala) సంగీతం ఎంటర్‌టైమెంట్ డబుల్ చేశాయి.

ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అభినవ్ కూనపరెడ్డి ఎడిటర్. అతి త్వరలోనే ఈ 'అనుమాన పక్షి' థియేటర్లకు రానుంది.

Also Read: Ramayan: రామాయణ స్క్రిప్ట్, పాత్రల్లో మార్పు.. డైరెక్టర్ కౌంటర్

Also Read: Akshay Kumar: తన కుమార్తె ఎదుర్కొన్న చేదు అనుభవం.. ఇది దారుణం

Updated Date - Oct 03 , 2025 | 07:00 PM