Akshay Kumar: తన కుమార్తె ఎదుర్కొన్న చేదు అనుభవం.. ఇది దారుణం
ABN , Publish Date - Oct 03 , 2025 | 06:34 PM
‘కొన్ని నెలల క్రితం తన కూతురు ఎదుర్కొన్న ఓ ఘటన గురించి అక్షయ్ కుమార్ (Akshay kumar)మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దురాగతాలను ఆయన బయటపెట్టారు.
‘కొన్ని నెలల క్రితం తన కూతురు ఎదుర్కొన్న ఓ ఘటన గురించి అక్షయ్ కుమార్ (Akshay kumar)మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు (Cyber criminals) చేస్తున్న దురాగతాలను ఆయన బయటపెట్టారు. ఈ విషయం అప్రమత్తంతగా ఉండాలని సూచించారు. సామాన్యులే కాదు.. అన్ని సౌకర్యాలు, సెక్యూరిటీ ఉన్న సెలబ్రిటీలు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, మాయ మాటలు చెప్పి మోసం చేయడం లాంటివి రోజు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. దీనిపై తనవంతుగా సైబర్‌క్రేౖమ్‌పై పోరుకి దిగారు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్. చిన్నారుల విషయంలో జరిగే మోసాలను ఆయన వివరించారు. ముంబయి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తన కుమార్తె ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. (Akshay Kumar Daughter)
‘‘కొన్ని నెలల క్రితం ఇంట్లో జరిగిన చిన్న ఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నా. నా కూతురు ఆన్‌లైన్‌లో ఓ గేమ్ ఆడుకుంటోంది. ‘నువ్వు ఆడా, మగా?’ అని ఓ అపరిచితుడి నుంచి మెేసజ్ వచ్చింది. తనేమో ఆడపిల్లని అని సమాధానమిచ్చింది. ‘నీ న్యూడ్ ఫొటోలు పంపగలవా?’ అంటూ అతడు మరో మెేసజ్ పంపాడు. వెంటనే మా అమ్మాయి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, జరిగిందంతా వాళ్లమ్మకు చెప్పింది. ఇది కూడా సైబర్ క్రైమ్‌లో భాగమే. దీనిని కట్టడి చేయడం ఎంతో అవసరం. పాఠశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలి. సైబర్ ఎడ్యుకేషన్‌ను వీక్లీ సబ్జెక్ట్‌గా పెట్టాలని మహారాష్ట్ర గవర్నమెంట్‌ను కోరారు.