సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Radhika Apte: సౌత్ సినిమాలు.. ఆ పార్ట్స్ ఎక్కువ కనిపించాలని టార్చర్ చేశారు

ABN, Publish Date - Dec 20 , 2025 | 06:34 PM

లీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రక్త చరిత్ర సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ కి పరిచయమయ్యింది.

Radhika Apte

Radhika Apte: సౌత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంటే.. కొంతమంది నటీనటులు ఇప్పటికీ అందులో తాము పడిన బాధలను ఎత్తిచూపుతున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రక్త చరిత్ర సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ కి పరిచయమయ్యింది. దీని తరువాత తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఇక్కడ ఆమెకు అంత గుర్తింపు దక్కలేదు. దీంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బోల్డ్ పాత్రలకు సై అని.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

స్టార్ హీరోయిన్ గా ఎదిగాక రాధికా సౌత్ సినిమాల గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ కి ప్రాధాన్యత ఉండదు. వారు ఏది చెప్తే అది చేయాలి అప్పట్లో తప్పక నటించాను.. ఇలా తన ప్రతి సినిమాకు ఇదే పాట పాడుతూ హైలైట్ అవ్వాలని చూస్తోంది. మరోసారి రాధికా అదే సౌత్ సినిమాల గురించి మాట్లాడి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం సాలీ మొహబ్బత్. ఈ సినిమా ప్రమోషన్స్ లో రాధికా సౌత్ ఇండస్ట్రీ గురించి.. ఆమె తన కెరీర్ మొదట్లో పడిన ఇబ్బందులు గురించి, సినిమా షూటింగ్ లో తాను పడిన టార్చర్ గురించి చెప్పుకొచ్చింది.

' సౌత్ ఇండియా సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను చేసిన సినిమాల గురించి మాట్లాడాలంటే.. నా కెరీర్ ప్రారంభంలో ఆర్థిక పరిస్థితి బాలేక నేను సౌత్ సినిమాలు చేశాను. ఒక సినిమా షూటింగ్ లో ఎంతో భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నాను. అది ఒక మారుమూల పల్లెటూర్లలో షూటింగ్ చేశారు. అక్కడ డైరెక్టర్ .. ఎక్కువ నా పిరుదులకు, బ్రెస్ట్ కి ప్యాడ్స్ వేయించారు. ఆ రెండు పార్ట్స్ ఎక్కువగా కనిపించాలని ఇంకా.. ఇంకా ప్యాడ్స్ వేశారు. ఇంకెంత వేస్తారు.. ఇంకెంత.. ఎంత రౌండ్ గా వచ్చేలా చేస్తారు. నేను డైరెక్టర్ కి వెళ్లి చెప్పాను. సార్.. నో ప్యాడ్.. నేను వేసుకోను అని చెప్పాను. కానీ, మీకు నచ్చినట్లు ఉండడానికి లేదు అని చెప్పారు. సెట్ లో నేను ఒక్కదాన్నే మహిళను. నా అసిస్టెంట్స్ ని కూడా రానిచ్చేవారు కాదు. సెట్ లో ఆడవారిపై అసభ్యకరమైన జోకులు వేసేవారు.. సాధారణంగా షూటింగ్ సెట్ లో నేను చాలా దైర్యంగా ఉంటాను. ఇప్పటికీ అలానే ఉన్నాను. కానీ, అప్పటి రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. ఏ నటికీ నాలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాధికా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Dec 20 , 2025 | 06:34 PM