Raashii Khanna: ఉస్తాద్ తో సెల్ఫీ.. జీవితాంతం గుర్తుండిపోతుందన్న రాశీ
ABN, Publish Date - Sep 14 , 2025 | 07:27 PM
అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా (Raashii Khanna) ఎప్పటినుంచో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి చాలా కష్టపడుతున్న విషయం తెల్సిందే.
Raashii Khanna: అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా (Raashii Khanna) ఎప్పటినుంచో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి చాలా కష్టపడుతున్న విషయం తెల్సిందే. కుర్ర హీరోల సరసన నటించినా అమ్మడికి అంతంత మాత్రం గుర్తింపే దక్కింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలో కూడా రాశీ తన లక్ ను పరీక్షించుకుంది. కానీ, ఎక్కడా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా కూడా నిరాశపడకుండా వచ్చిన అవకాశాలను అందుకొని ముందుకు దూసుకుపోతుంది.
ఇక ఈ మధ్యనే రాశీ ఖన్నా లక్కీ ఛాన్స్ పట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ పట్టేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తేరి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఎప్పటినుంచో పవన్ కోసం ఎదురు చూసి చూసి.. ఈ మధ్యనే హరీష్.. ఉస్తాద్ ను పట్టాలెక్కించాడు.
ఇక పవన్ సైతం ఉస్తాద్ కు భారీగానే డేట్స్ ఇచ్చాడు. కొంతకాలంగా కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొని ఎట్టకేలకు పవన్ తన పని పూర్తి చేశాడు. పవన్ ఉస్తాద్ షూటింగ్ ను పూర్తిచేసినట్లు హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. చివరి రోజు పవన్ తో ఒక సెల్ఫీని తీసుకొని అభిమానులతో పంచుకుంది. ' ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పవన్ కళ్యాణ్ గారు పూర్తిచేశారు. ఈ చిత్రంలో ఆయనతో కలిసి నటించడం అద్భుతంగా ఉంది. ఇది నాకు నిజమైన గౌరవం మరియు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రాశీ ఖన్నా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.