Pawan kalyan - Raashi khanna: ఉస్తాద్ సరసన ఛాన్స్ కొట్టేసింది..
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:15 PM
రాశీఖన్నా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది.
రాశీఖన్నా (Rashi khanna) మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. 12 ఏళ్లుగా టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాల తర్వాత తెలుగులో మరో సినిమా అవకాశం అందుకోలేదు. కొంతగ్యాప్ తర్వాత ఓ పెద్ద అవకాశం అందుకున్నారు. రాశీఖన్నా. అది కూడా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సరసన. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌లో (Ustaad Bhagat Singh) రాశీ అవకాశాన్ని సొంతం చేసుకొంది. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీలీల ఓ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే!
అయితే ఇందులో మరో నాయికకు అవకాశం ఉండటంతో ఆ పాత్రకోసం రాశీ ఖన్నాని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఆమె సెట్‌లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ - హరీశ్‌శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే కొంత విరామం తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ మొదలైంది. హరీశ్ శంకర్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.
ALSO READ:
Indian Boxoffice: బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఓర్మాక్స్ నివేదిక ఎలా ఉందంటే...
Producer Naga Vamsi: హరిహర వీరమల్లును డిస్ట్రబ్ చేయం.. నాగవంశీ కామెంట్స్