సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ustaad Bhagat singh: ఉస్తాద్‌లో రాశీఖన్నా అఫీషియల్‌.. దర్శకుడి ట్వీట్‌ వైరల్‌

ABN, Publish Date - Jul 22 , 2025 | 01:57 PM

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో కథానాయికగా రాశీఖన్నాను తీసుకున్నారని, ఇటీవల ఆమె సెట్‌లో అడుగుపెట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఇటీవల సినిమా షూటింగ్‌ రీస్టార్‌ చేశారు. సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు  తహతహలాడుతున్నారు. తాజాగా మేకర్స్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో కథానాయికగా రాశీఖన్నాను తీసుకున్నారని, ఇటీవల ఆమె సెట్‌లో అడుగుపెట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తల్ని నిజం చేస్తూ  మేకర్స్‌ అఫీషియల్‌గా ఈ విషయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను షేర్‌ చేశారు.

ఇందులో ఆమె ‘శ్లోక’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. మెడలో కెమెరా వేసుకుని ఫోజ్‌ ఇచ్చిన రాశీఖన్నా పిక్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. తన పాత్రతో సినిమాకు మరింత అందాన్ని తెస్తుందన్నారని,  ప్రస్తుతం ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందులో శ్రీలీల ఓ పాత్ర పోషిస్తుండగా, మరో పాత్ర కోసం రాశీఖన్నాను తీసుకున్నారు. ‘గబ్బర్‌సింగ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమా తర్వాత పవన్‌కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. దీనిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  


హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ వైరల్‌..  
సోమవారం పవన్‌ నటించిన ‘హరి హర వీరమల్ల్లు’ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పవన్‌ లుక్‌ అందర్నీ ఆకర్షించింది. దీనిపై ఓ అభిమాని పోస్ట్‌ పెట్టగా.. దానికి హరీశ్‌ శంకర్‌ సరదాగా రిప్లై ఇచ్చారు. ‘పవన్‌ ఉస్తాద్‌ లుక్‌ అదిరిపోయింది. ఓ అభిమానిగా హరీశ్‌ శంకర్‌ ఆయన్ని అద్భుతంగా చూపించనున్నారని అర్థమవుతోంది. ఎలా అయ్యా హరీశ్‌ ఈ ఫ్యానిజం’’ అని పోస్ట్‌ పెట్టారు. దీనికి దర్శకుడు రిప్లై ఇస్తూ.. ‘తరతరాలుగా.. నరనరాల్లో ఆయనపై అబిమానం ఎగసిపడుతుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

Updated Date - Jul 22 , 2025 | 02:30 PM