Elumalai: హీరోగా.. ఇడియట్ రక్షిత సోదరుడు! టీజర్ అదిరింది
ABN, Publish Date - Jul 08 , 2025 | 09:20 PM
రవితేజ ఇడియట్ కథానాయిక రక్షిత సోదరుడు రాన్నా హీరోగా రూపొందిన చిత్రం ఎలుమలై.
రవితేజ ఇడియట్ కథానాయిక రక్షిత సోదరుడు రాన్నా (RAANNA) హీరోగా కన్నడ టీ తెలుగు మహనటి ఈవెంట్ విన్నర్ , ప్రియాంక అచార్ (PRIYANKA ACHAR) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ రూపొందిన చిత్రం ఎలుమలై. జగపతి బాబు (JAGAPATHI BABU), కన్నడ కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ కన్నడ దర్శకనిర్మాత తరుణ్ సుధీర్ నిర్మిస్తుండగా, తనే వద్ద పని చేసిన పునీత్ రంగస్వామి (PUNIT RANGASWAMY) దర్శకత్వం వహించాడు.
నిజ జీవిత ఘటన ఆధారంగా లవ్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ రిలీజ్ చేసిన మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఓ టూ వీలర్‌పై వెళుతున్న కథానాయిక తన ప్రేమ గురించి చెబుతూ ఉంటుంది. మరోవైపు సంకెళ్లతో ఉన్న హీరో వెళుతున్న బండికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇంకోవైపు భారీగా పోలీసులు, అయుధాలతో టీజర్‌ను ముగించారు.