సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pushpa Vs OG: పుష్ప స్మగ్లర్ సినిమా అయితే.. ఓజీ భక్తి చిత్ర‌మా! ఫ్యాన్ వార్ మాములుగా లేదుగా

ABN, Publish Date - Sep 25 , 2025 | 01:28 PM

పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ మూవీ కామెంట్స్, ఓజీ రిలీజ్ సమయానికి బన్నీ ఫ్యాన్స్ చేత ట్రోల్ అవుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Pushpa Vs OG

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సినిమాల‌తోనే కాకుండా సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు కూడా పెద్ద సంచలనంగా మారుతుంటాయి. గతంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘పుష్ప’(Pushpa)ను ఉద్దేశించి పవన్ 'స్మగ్లింగ్ మూవీ' అని పరోక్షంగా వ్యాఖ్యానించగా, అప్పట్లో పెద్ద రాద్ధాంతమే అయింది. అయితే ఇప్పుడు పవన్ నటించిన గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ‘ఓజీ’ (OG) విడుదల నేప‌థ్యంలో బన్నీ (అల్లు అర్జున్) అభిమానులు ఆయనపై మళ్లీ ట్రోలింగ్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఒకటి రెండు కాదు, వందల కామెంట్లు, మీమ్స్, స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రముఖంగా.. 'పుష్ప స్మగ్లర్ సినిమా అయితే, ఓజీ భక్తి చిత్రం ఏంటి?' అంటూ.. ఇలా వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ, అభిమానులు పవన్ గత వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో గ‌త సంవ‌త్స‌రం కర్ణాటకలో పర్యటించిన పవన్ కళ్యాణ్, అడవులను కాపాడేవారు హీరోగా గుర్తించబడే వాడ‌ని, కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవాళ్ళు హీరోలు అంటూ మీడియాతో తెలిపారు. స‌రిగ్గా ‘పుష్ప 2’ సినిమా ఫీవర్ నడుస్తున్న సమయంలో ఈ సంద‌ర్భం చోటు చేసుకోవ‌డంతో అల్లు కుటుంబంతో సంబంధాలు సరిగ్గా లేవని, మీడియా ప్రచారం కూడా ఉండటంతో, అభిమానులు ఈ వ్యాఖ్యలను మరీ వ్యక్తిగతంగా తీసుకున్నారు. దీంతో మెగా సినిమాలు విడుద‌లైన ప్ర‌తీ సారి అల్లు అభిమానులు రంగంలోకి దిగి సోష‌ల్‌మీడియాలో ట్రోల్స్ తో రెచ్చి పోయే వారు.


కాగా.. ఇటీవల అల్లు అర్జున్ నాయనమ్మ, అల్లు కనకరత్నమ్మ మరణించడంతో, పవన్ వారింటికి వెళ్లి అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ను పరామర్శించారు. ఆ సమయంలో ఇద్దరు హీరోలు ఆప్యాయంగా పలకరించి, హత్తుకున్న దృశ్యాలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇక వీళ్ల మ‌ధ్య ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేవ‌ని అంతా క‌లిసే ఉన్నార‌నే విష‌యం తేట తెల్ల‌మైంది. అయిన‌ప్ప‌టికీ ఇవేవి ప‌ట్ట‌ని అల్లు ఫ్యాన్స్ మాత్రం.. పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోకుండా ఓజీ రిలీజ్ సమయానికి, పవన్ ఓజస్ గంభీరగా గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించడంతో, సోషల్ మీడియాలో 'పుష్ప స్మగ్లర్, ఓజీ భక్తి సినిమానా' అంటూ వ్యంగ్యంగా ట్రోలింగ్ చేయ‌డం ప్రారంభించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం ఎంట్రీ ఇచ్చి పుష్ఫ‌లో హీరో స్మ‌గ్లింగ్ చేసే వాడ‌ని.. కానీ మా హీరో ఓజీ స్మ‌గ్లింగ్ త‌న ఛాయ‌లకు రాకుండా చూసే వాడంటూ కౌంట‌ర్లు ఇస్తున్నారు.

దీంతో ఇప్పుడు ఫ్యాన్ వార్స్ మ‌ళ్లీ మొద‌లై ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. దీనికి తోడు ఈ స‌మ‌యానికి విడుద‌ల కావాల్సిన బాల‌కృష్ణ అఖండ‌2 ఓజీ వ‌ల్ల వాయిదా ప‌డిందంటూ నంద‌మూరి ఫ్యాన్స్ సైతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. ఓజీ రిలీజ్ అయ్యే స‌మ‌యానికి డిజాస్ట‌ర్ ఓజీ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్‌లోకి తీసుకు వ‌చ్చి ఫ్యాన్ వార్స్ తో అంత‌కంత‌కు హీట్ పెంచుతున్నారు. అయితే.. ఇలా అంత‌ర్గతంగా చాలా జ‌రుగుతున్నా వాస్త‌వంలోకి వ‌చ్చే స‌రికి ‘ఓజీ’ ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్‌లో హావా చాటుతుంది. సినిమాకు సైతం అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తుండ‌డంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అడ్డం లేకుండా పోయింది. ఇప్పుడు చెప్పండిరా.. మ‌మ్మల్ని ఎవ‌డ్రా ఆపేది అంటూ ట్వీట్ల‌తో చెల‌రేగి పోతున్నారు.

Updated Date - Sep 25 , 2025 | 07:13 PM