సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pushpa 2: పుష్పగాడి రూల్.. ఇప్పుడు జపాన్ లో

ABN, Publish Date - Dec 03 , 2025 | 08:07 PM

సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఒక డైలాగ్ అంటాడు. మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు. హైదరాబాద్ లో కూడా తెలియాలా.. అన్నట్లు మన తెలుగు సినిమా గురించి ఇండియాలో తెలిస్తే చాలదు.. జపాన్ లో కూడా తెలియాలా.

Pushpa 2

Pushpa 2: సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఒక డైలాగ్ అంటాడు. మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు. హైదరాబాద్ లో కూడా తెలియాలా.. అన్నట్లు మన తెలుగు సినిమా గురించి ఇండియాలో తెలిస్తే చాలదు.. జపాన్ లో కూడా తెలియాలా. అందుకే టాలీవుడ్ మేకర్స్ మన తెలుగు సినిమాలను వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. దీనిని మొదలుపెట్టింది కూడా రాజమౌళి (Rajamouli)నే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను జపాన్ లో రిలీజ్ చేయడమే కాకుండా అక్కడకు వెళ్లి మరీ ప్రమోషన్స్ చేసి ఇంటర్నేషనల్ వేదికపై మన తెలుగువాళ్ల సత్తా చూపించాడు.

ఇక ఇప్పుడు పుష్ప వంతు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఇండస్ట్రీ చరిత్రనే మార్చేసింది. ఇక గతేడాది రిలీజ్ అయిన పుష్ప 2.. రికార్డులు బద్దలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వందల కోట్లను రాబట్టి రికార్డ్ సృష్టించిన పుష్ప 2 ఇప్పుడు ఎక్కడా తగ్గేదేలే అంటూ జపాన్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది. తాజాగా మేకర్స్ జపాన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

వచ్చే ఏడాది జనవరి 16 న పుష్ప 2 జపాన్ లో రిలీజ్ కానుంది. అందుకోసం మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి లానే అల్లు అర్జున్ - సుకుమార్ సైతం జపాన్ లో ప్రమోషన్స్ చేయనున్నారట. గతంలో పుష్ప రష్యాలో రిలీజ్ అయ్యినప్పుడు బన్నీ ప్రమోషన్స్ కోసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు జపాన్ అంటే.. కొద్దిగా అనుమానమే అని అంటున్నారు. అందుకు కారణం ప్రస్తుతం బన్నీ.. అట్లీ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం బన్నీ చాలా లుక్స్ ను మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ ప్రమోషన్స్ కి వెళితే అవి లీక్ అవ్వడం, షూటింగ్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Dec 03 , 2025 | 08:52 PM