సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: ‘పుష్ప-2’కు ఏడాది... బన్నీ భావోద్వేగ పోస్ట్‌

ABN, Publish Date - Dec 05 , 2025 | 02:19 PM

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై శుక్రవారానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పుష్ప సినిమా జర్నీని గుర్తు చేసుకున్నారు బన్నీ.

allu arjun


అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై శుక్రవారానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పుష్ప సినిమా జర్నీని గుర్తు చేసుకున్నారు బన్నీ. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘పుష్ప సినిమా ఐదేళ్ల జర్నీ. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు మాపై చూపించిన ప్రేమాభిమానాలు ఎంతో ప్రత్యేకం. వాళ్లు ఎంతో  ధైౖర్యాన్నిచ్చారు. అంతే కాదు అద్భుతమైన సక్సెస్‌ను అందించారు. అందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ సినిమాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగమైన అందరికీ కృతజ్ఞతలు. సుకుమార్‌తో కలిసి వర్క్‌ చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  

 
సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన సినిమా ఇది.  ‘పుష్ప’ మొదటి భాగం 2021లో విడుదలై సూపర్‌హిట్‌ అయింది. అంతే కాదు అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం తీసుకొచ్చింది. పుష్పకు కొనసాగింపుగా తెరకెక్కిన ‘పుష్ప 2’ గతేడాది డిసెంబర్‌ 5న విడుదలై రికార్డులు బ్రేక్‌ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి మూడో భాగంగా ‘పుష్ప3: ది ర్యాంపేజ్‌’ ఉందని సుకుమార్‌ ఇప్పటికే వెల్లడించారు. దానికి సంబంధించిన కథ, ఇతర పనులు కూడా పూర్తయ్యాయని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ చెప్పారు.

Updated Date - Dec 05 , 2025 | 02:46 PM