Puri- Sethupathi:  మారిన పూరి- సేతుపతి టైటిల్.. ?

ABN , Publish Date - Jun 07 , 2025 | 06:51 PM

 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో పూరి  తెరకెక్కిస్తున్న చిత్రం పూరి - సేతుపతి(Puri-Sethupathi).

Puri- Sethupathi

Puri- Sethupathi:  డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి  జగన్నాథ్(Puri Jagannath) ఇండస్ట్రీలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చేస్తున్నాడు. లైగర్ లాంటి భారీ పరాజయం  తరువాత డబుల్ ఇస్మార్ట్ అంటూ మరో సినిమాతో వచ్చాడు పూరి. ఇదైనా  వర్క్ అవుట్ అవుతుంది అనుకుంటే.. అది కూడా పరాజయాన్నే అందుకుంది. దీంతో ప్రేక్షకులు  పూరిలో  కొత్తదనం లేదని, ఇక సినిమాలు మానేస్తే మంచిదని కామెంట్స్ చేసారు. పూరి పని అయిపోయింది అన్న ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూ  వచ్చాడు. ఇప్పుడు కూడా అలాంటి సినిమాతోనే రాబోతున్నాడు.

 

 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో పూరి  తెరకెక్కిస్తున్న చిత్రం పూరి - సేతుపతి(Puri-Sethupathi).  పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మీ(Charmee)తో కలిసి పూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో టబు(Tabu),  దునియా విజయ్(Duniya Vijay) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న  ఈ సినిమా టైటిల్ బెగ్గర్(Beggar) అని ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కథకు తగ్గట్లు బెగ్గర్ అనే టైటిల్ చక్కగా సరిపోతుందని, అందుకే ఆ టైటిల్ నే  కన్ఫర్మ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చాయి.

 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బెగ్గర్ టైటిల్ మారిందంట. అన్ని భాషల్లో ఒకేలా ఉండే టైటిల్ ను తీసుకోమని విజయ్ సేతుపతి.. పూరికి సూచించాడని సమాచారం. ఈమధ్యకాలంలో కోలీవుడ్ ప్రేక్షకులు టైటిల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వేరే భాషల్లో వచ్చే టైటిల్ కానీ, ఇంగ్లీష్ టైటిల్స్ ను కానీ అస్సలు అంగీకరించడం లేదు. అందులోనూ ఇంగ్లీష్ లో టైటిల్ పెడితే రీచ్ ఉండదని చెప్పాడట. దీంతో బాగా ఆలోచించి  బెగ్గర్ అర్ధం వచ్చేలా భవతీ భవతీ భిక్షాందేహి(Bhavathi Bikshamdehi) అనే టైటిల్ ను అనుకుంటున్నారట.

 

 బిచ్చగాడు..  భిక్ష అడిగేటప్పుడు అనే మాటనే భవతీ  భిక్షాందేహి.. అంటే ఓ తల్లి.. దయచేసి నాకు అన్నం పెట్టండి అని అర్ధం. ఈ సినిమాలో విజయ్ బెగ్గర్ గా కనిపించనున్నాడు. అందుకే ఈ టైటిల్ కూడా యాప్ట్ గా ఉంటుందని , దాంతోపాటు   అన్ని భాషలకు సెట్ అయ్యే విధంగా ఉంటుందని  ఇదే ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ టైటిల్ తోనే మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో పూరి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా.. ? అనేది చూడాలి. 

Updated Date - Jun 07 , 2025 | 06:51 PM