Puri Jagannadh: పూరిసేతుపతి ఐదు నెలల్లో క్లోజ్‌..

ABN , Publish Date - Nov 24 , 2025 | 10:51 AM

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (puri jagannath) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే!

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (puri jagannath) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! పూరిసేతుపతి వర్కింగ్‌ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ‘కొన్ని నెలల జర్నీ, భావోద్వేగ క్షణాలు, మరెన్నో ఆనందమైన అనుభవాలతో మా సినిమా షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే వరుస అప్‌డేట్స్‌ రానున్నాయి. అందరూ వేచి ఉండండి’ అంటూ ఒక ఫన్నీ వీడియో షేర్‌ చేశారు.

Puri.jpg

పూరి జగన్నాథ్‌ను మిస్‌ అవుతానని ఆ వీడియోలో విజయ్‌ సేతుపతి అన్నారు. పూరి జులై మొదటివారంలో ఈ సినిమా షూటింగ్‌ మొదలెట్టారు. ఐదు నెలల్లోనే పూర్తి చేశారు. ఇందులో సంయుక్త కథనాయికగా నటించారు. టబు, విజయ్‌కుమార్‌ కీలక పాత్రధారులు. విజయ్‌ ేసతుపతి ఇంతకుముందు చేయని పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకి ‘బెగ్గర్‌’ టైటిల్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Nov 24 , 2025 | 12:15 PM