సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Puri jaganath: ఆ అభిమాని ఎవరో కాదు.. పూరి జగన్నాథ్‌..

ABN, Publish Date - Sep 25 , 2025 | 03:34 PM

మెగాస్టార్‌ చిరంజీవికి (Megastar Chiranjeevi) ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. వారంతా రకరకాలుగా ఆయనపై అభిమానం చూపిస్తుంటారు. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రిటీల్లోనూ ఆయనకు ఫ్యాన్స్‌ ఉన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవికి (Megastar Chiranjeevi) ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. వారంతా రకరకాలుగా ఆయనపై అభిమానం చూపిస్తుంటారు. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రిటీల్లోనూ ఆయనకు ఫ్యాన్స్‌ ఉన్నారు. అందులో చిరు యాక్టింగ్‌, డాన్స్‌కు ఫిదా అయ్యి, ఆయన్ను చూసి ఇన్‌స్పైర్‌ అయి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలే కాదు.. దర్శకనిర్మాతలు చాలామంది ఉన్నారు. దర్శకుల్లో తీసుకుంటే పూరి జగన్నాథ్‌ (Puri jaganath) చిన్నప్పటి నుంచి చిరంజీవికి వీరిభిమాని. ఆయన్ను చూస్తూ పెరిగిన పూరి.. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. చిరుతో 'ఆటోజానీ' సినిమా తీయాలనుకున్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ 'గాడ్‌ఫాదర్‌' సినిమాలో ఓ సీన్‌లో నటించారు. కుదిరిన ప్రతిసారీ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుతుంటారు పూరి జగన్‌.

చిన్నప్పుడు అంటే చిరంజీవి నటించిన ‘ఖైదీ’ చిత్రం విడుదలైన సందర్భంలో జరిగిన ఓ సంఘటనను పూరి జగన్నాథ్‌ గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే చిరుపై ఎనలేని అభిమానం ఉన్న ఆయన 'ఖైదీ' సినిమా రిలీజ్‌ రోజులు తన స్వహస్తాలతో చిరంజీవి బొమ్మ గీశారు పూరి. అది సినిమా రిలీజ్‌ అయిన థియేటర్‌ దగ్గర డిస్‌ప్లేలో ఉంచారు. దానికి సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని పూరి గుర్తు చేసుకున్నారు. సంబంధిత  డైరీ దొరికిందని ట్వీట్‌ చేశారు. (Rare Pic of Chiru)

‘పాత డైరీ దొరికింది(Puri jaganath Memory) . 'ఖైదీ' సినిమా రిలీజ్‌ రోజున ఒక అభిమాని తర స్వహస్తాలతో చిరంజీవి (Khaidi Release Time) గారి చిత్రం గీసి థియేటర్‌ దగ్గర ఫోటో కార్డు డిస్‌ప్లేలో ఉంచిన 60/40 ఫొటో దొరికింది. ఆ అభిమాని ఎవరో కాదు. పూరి జగన్నాథ్‌’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ డైరీ, అందులో చిరంజీవి ఫొటో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. దీనికి అభిమానులు స్పందిస్తూ ‘నువ్వు చిరుకి నిజమైన అభిమానివి’ కామెంట్స్‌ చేస్తుంటే, మరి కొందరు పాతికేళ్లుగా మీ ఇద్దరి కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Updated Date - Sep 25 , 2025 | 03:48 PM