Puri Aakash: పూరి జగన్ - సేతుపతి- ఆకాష్ పూరి
ABN , Publish Date - May 10 , 2025 | 01:15 PM
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupati) కీలక పాత్రలో పూరి జగన్నాథ్ (Puri Jaganath) దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupati) కీలక పాత్రలో పూరి జగన్నాథ్ (Puri Jaganath) దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్ ఇతర క్యారెక్టర్లు ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. కన్నడ ఆర్టిస్ట్ దునియా విజయ్ (Duniya Vijay) ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రంలో పూరి తనయుడు ఆకాష్ పూరి ఓ కీ రోల్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఆ పాత్రను స్పెషల్‌గా డిజైన్ చేశారని తెలిసింది. ఆకాష్ వయసున్న కుర్రాడైతే ఆ పాత్రకు సరిపోతాడని భావించిన పూరి ఆకాష్‌నే (Puri Akash) ఎంపిక చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తే గానీ నిజం ఏంటనేది తెలీదు.
పూరి ఆకాష్ కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ‘మెహబూబా’తో హీరోగా పరిచయమైన ఆకాష్ అటుపై ‘రొమాంటిక్’, ‘చోర్ బజార్’ లాంటి చిత్రాల్లో నటించాడు. ఇవేవి ఆకాష్‌ని స్టార్‌గా మార్చలేకపోయాయి. ప్రస్తుతం అవకాశాలూ కరువయ్యాయి. ఇటు పూరి కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆకాశ్ అయితే సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరో పాత్రలు రావడం లేదని తండ్రి సినిమాలో కీ రోల్‌కి అంగీకరించాడని తెలుస్తోంది. పూరి ఎవరికీ రికమండ్ చేయడు. ఆకాష్ కూడా అడగడు.