సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

SKN: బండ్ల గణేశ్‌కు.. గ‌ట్టి కౌంటర్ ఇచ్చిన SKN! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

ABN, Publish Date - Nov 13 , 2025 | 10:26 AM

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.

skn

రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో రాహుల్ ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్రంది గ‌ర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) గ‌త వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాత్రి ఈ చిత్రం విజయోత్సవ సభ నిర్వ‌హించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత SKN మాట్లాడిన మాటలు ఇప్పుడు టాలీవుడ్ అంతా హాట్ టాపిక్‌గా మారాయి.

SKN మాట్లాడుతూ..“బేబీ సినిమాతో నేను నిర్మాత కాలేదు. ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడటానికి కారణం నా బంగారు కొండ విజయ్ దేవరకొండే. టాక్సీవాలా సినిమా పూర్తిగా లీక్ అయినప్పుడు అందరూ ఓటీటీకి ఇవ్వమన్నారు. కానీ విజయ్ ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన లేకపోతే రాహుల్ లేదు, నేను లేను” అంటూ SKN ఎమోషనల్ అయ్యారు.“మనిషి కష్టానికి విలువ ఇచ్చే టాలీవుడ్ ప్రిన్స్ విజయ్ దేవరకొండ. ఆయన పోస్టర్ పెట్టినా చాలు బాక్సాఫీస్ పగలిపోతుంది. కొంతమంది ఆయనపై చెవాకులు పేలుస్తున్నారు, కానీ బోనులో ఉన్నా సింహమే సింహం” అంటూ బండ్ల గణేష్ (Bandla Ganesh) ను ఉద్దేశించినట్లుగా SKN మాట్లాడారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ లైనప్ నాకు తెలుసు. ఆరు నెలల్లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కొడితే లక్ అంటారు, మూడోసారి కొడితే ఇండస్ట్రీ షేక్ అంటారు. అదే విజయ్ దేవరకొండ పవర్ అని ఘాటుగా అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు “బండ్ల గణేష్‌కు పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు SKN” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది “SKN మాట్లాడితే ఫైర్‌ వస్తుంది” అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇటీవల బండ్ల గణేష్ మాట్లాడుతూ.. వాట్సప్ వాట్సప్ అంటే హిట్ సినిమాలు రావు” అని విజయ్ దేవరకొండపై పరోక్షంగా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అలాగే “అల్లు అరవింద్ ఎప్పుడూ చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు” అని అన్న గణేష్ వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. దీనికే సమాధానంగా భారతదేశంలో ఎవరూ ఇంతకాలం యాక్టివ్‌గా ఉంటూ హిట్లు కొడుతూ, తమ చుట్టూ ఉన్న వాళ్లను కూడా హిట్ చేయడం చేయరు. అల్లు అరవింద్ లాంటి వారు ఎప్పుడూ క్రెడిట్ తీసుకోరు, తమ టీమ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తారని SKN ఘూటుగా రిప్తై ఇచ్చారు.

Updated Date - Nov 13 , 2025 | 10:26 AM