Shirish Reddy: చరణ్ ను అవమానించలేదు.. గేమ్ ఛేంజర్ వివాదంపై శిరీష్ రెడ్డి వివరణ
ABN, Publish Date - Jul 02 , 2025 | 05:59 PM
గత రెండు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వివాదం.. గేమ్ ఛేంజర్(Game Changer). నిర్మాత దిల్ రాజు (Dil Raju) తమ్ముడు శిరీష్ రెడ్డి (Shirish Reddy) ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ (Ram Charan) పై ఆరోపణలు చేశాడు.
Shirish Reddy: గత రెండు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వివాదం.. గేమ్ ఛేంజర్(Game Changer). నిర్మాత దిల్ రాజు (Dil Raju) తమ్ముడు శిరీష్ రెడ్డి (Shirish Reddy) ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ (Ram Charan) పై ఆరోపణలు చేశాడు. గేమ్ ఛేంజర్ సినిమా ప్లాప్ వలన తామెంతో నష్టపోయామని, హీరో రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ కానీ ఒక్కరు కూడా కనీసం ఫోన్ చేసి అడిగినవాళ్లు లేరు. డబ్బు వెనక్కి ఇచ్చినవారు లేరు అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ వీడియోపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తమ హీరోను ఇంతలా అవమానించడం పద్ధతి కాదని, సినిమా హిట్ అయితే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా.. ? ప్లాప్ అయితే హీరో ఎందుకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అంటూ ప్రశ్నించారు.
ఇక శిరీష్ వ్యాఖ్యలు ఎంత రచ్చ చేశాయి అంటే మెగా ఫ్యాన్స్ దిల్ రాజుకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎంత మంచి చేసినా.. చరణ్ ఫై నిందలు వేశారని, ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అస్సలు ఊరుకొనేది లేదని ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఇక మొత్తం డ్యామేజ్ అవ్వడంతో దిల్ రాజు రంగంలోకి దిగి.. శిరీష్ చేత ఒక ప్రకటన ఇప్పించాడు. 'నేను ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు... సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది.
గేమ్ ఛేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము.ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే... క్షమించండి' అంటూ రాసుకొచ్చాడు. ఇక్కడితో ఈ వివాదం సద్దుమణిగిద్దేమో అనుకున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించలేదు. దీంతో శిరీష్ ఈసారి వీడియో బైట్ ద్వారా క్షమాపణలు చెప్పుకొచ్చాడు.
'తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నమస్కారం. మా SVC సంస్థకు, రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి అవినాభవ సంబంధం ఉంది. చరణ్ గారితో మాకు మంచి అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ఆయనను కించపరచడం కానీ, అవమానించడం కానీ నా జన్మలో నేనెప్పుడూ చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి ఒక చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వారందరికీ నేను క్షమాపణలు చెప్తున్నాను. చరణ్ గారికి కూడా క్షమాపణలు చెప్తున్నా. ఆయనతో ఉన్న రిలేషన్ ను నేను పాడు చేసుకోలేను. ఎందుకంటే జనం ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ, సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ, అభిమానుల బాధను కానీ నేను అర్ధం చేసుకున్నాను. మాకున్న రిలేషన్ లో ఉన్న క్లోజ్ నెస్ వలన మాట దొర్లాను తప్ప ఆయనను అవమానపర్చడానికి కాదు.
మెగా హీరోలతో మాకు మంచి రిలేషన్ ఉంది. వరుణ్ తేజ్ తో ఫిదా, సాయి ధరమ్ తేజ్ తో రెండు సినిమాలు చేశాను. ఇలాంటి అనుబంధం ఉన్న హీరోలను అవమానించేంత మూర్ఖుడిని కాదు. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ టైమ్ లో సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ చేయమని ఆయన చెప్పకపోతే అదసలు రిలీజ్ అయ్యేదే కాదు. ఆయన మనసు గొప్పది కాబట్టి.. ఆ సినిమాను రిలీజ్ చేసుకోమన్నారు. అలాంటి మనసు ఉన్న మనిషిని నేనేందుకు అవమానిస్తాను. నేను అన్న మాటలను అపార్థం చేసుకొని ఉంటే క్షమించండి.దయచేసి మా రిలేషన్ ను పాడుచేయొద్దు. మా బ్యానర్ లో చరణ్ గారిది నెక్స్ట్ సినిమా ఉంది. మా మధ్య విభేదాలను సృష్టించకండి. మొదటి ఇంటర్వ్యూ కాబట్టి కంగారులో మాటలు దొర్లితే అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు.
Peddi: రంగస్థలం, ఆర్ఆర్ఆర్ ను మించి పెద్ది.. హైప్ పెంచేసిన చరణ్